న్యూజిలాండ్‌లో అగ్నిపర్వతం పేలుడు...5గురు మృతి...

అగ్నిపర్వతం నుంచి మరింత విస్ఫోటనం వెలువడే ప్రమాదం ఉందని, ఇప్పుడు ద్వీపానికి చేరుకోవడం చాలా ప్రమాదకరమని పోలీస్ శాఖ తెలిపింది.


Updated: December 9, 2019, 11:09 PM IST
న్యూజిలాండ్‌లో అగ్నిపర్వతం పేలుడు...5గురు మృతి...
న్యూజిలాండ్‌లో అగ్నిపర్వతం పేలుడు...5గురు మృతి...(Image:CNN)
  • Share this:
న్యూజిలాండ్ లోని వైట్ ఐలాండ్‌లో అకస్మాత్తుగా అగ్నిపర్వతం పేలి ఐదుగురు చనిపోయారు. కాగా ఈ వైపరిత్యంతో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనేక మంది అక్కడ చిక్కుకుని పోయారు. సోమవారం మధ్యాహ్నం 2.11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఇంకా అగ్నిపర్వతం నుంచి మరింత విస్ఫోటనం వెలువడే ప్రమాదం ఉందని, ఇప్పుడు ద్వీపానికి చేరుకోవడం చాలా ప్రమాదకరమని పోలీస్ శాఖ తెలిపింది. పేలుడు సంభవించినప్పుడు అక్కడ దాదాపు 50 మంది టూరిస్టులు వైట్ ఐలాండ్‌ను సందర్శిస్తున్నారని పోలీసులు తెలిపారు. రాత్రి అవుతున్న కొద్దీ అక్కడకెళ్లి సహాయక రక్షణ చర్యలు చేపట్టడం ఎంతో ప్రమాదమని అని అన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఎక్కువ మంది ఆస్ట్రేలియన్లే తేల్చారు.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>