‘గే’ మ్యారేజ్‌లపై రష్యా అధినేత పుతిన్ కీలక నిర్ణయం

‘గే’ మ్యారేజ్‌లను చట్టబద్ధం చేయాలన్న డిమాండ్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ తిరస్కరించారు. తాను రష్యా అధ్యక్షుడిగా ఉన్నంత వరకు దీనికి ఆమోదం చెప్పబోనని ఆయన తేల్చిచెప్పారు.

news18-telugu
Updated: February 14, 2020, 3:22 PM IST
‘గే’ మ్యారేజ్‌లపై రష్యా అధినేత పుతిన్ కీలక నిర్ణయం
రష్యా అధ్యక్షుడు పుతిన్(ఫైల్ ఫోటో)
  • Share this:
‘గే’ మ్యారేజ్‌లను చట్టబద్ధం చేయాలన్న డిమాండ్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ తిరస్కరించారు. తాను రష్యా అధ్యక్షుడిగా ఉన్నంత వరకు దీనికి ఆమోదం చెప్పబోనని ఆయన తేల్చిచెప్పారు. అలాగే ‘అమ్మ’, ‘నాన్న’ పేర్లను ‘పేరంట్ 1’, ‘పేరంట్ 2’గా మార్చాలన్న డిమాండ్‌ను అంగీకరించబోనని ఆయన స్పష్టంచేశారు. ప్రతి బిడ్డకు అమ్మ, నాన్న ఉండాల్సిందేనని, ఇందులో మార్పు ఉండబోదన్నారు. గత రెండు దశాబ్ధాలుగా రష్యా అధికార పీఠంపై ఉన్న పుతిన్..స్వలింగ సంపర్కుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించే చట్టాలను సవరించేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. సాంప్రదాయ క్రైస్తవ కుటుంబానికి చెందిన పుతిన్..స్వలింగుల వివాహాలను ఎలా సమర్థించగలమని ప్రశ్నించారు.

gay marriage, vladimir putin, homosexuality, same sex marriage, putin news, russia news, russia gay marriage, వ్లాడిమిర్ పుతిన్, గే మ్యారేజ్, స్వలింగ సంపర్కులు
నమూనా చిత్రం


గే మ్యారేజ్‌లకు చట్టబద్ధం కల్పించబోమన్న పుతిన్ ప్రకటనను స్వలింగ సంపర్కులు, మానవ హక్కుల కార్యకర్తలు ఖండిస్తున్నారు. ఇది మానవ హక్కులను కాలరాయడమేనని మండిపడుతున్నారు.
Published by: Janardhan V
First published: February 14, 2020, 3:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading