Vladimir Putin: ఓ వైపు ఇలా.. మరోవైపు అలా.. ఇలాంటి పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదు.. రష్యా అధ్యక్షుడు పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(ఫైల్ ఫొటో)

రష్యాలో చోటుచేసుకుంటున్న ప్రకృతి వైపరీత్యాలతో ఆ దేశం వణికిపోతుంది. ఈ పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Share this:
    రష్యాలో చోటుచేసుకుంటున్న ప్రకృతి వైపరీత్యాలపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. సైబీరియా అడవుల్లో గతంలో చోటుచేసుకుని విధంగా రికార్డు స్థాయిలో మంటలు చెలరేగడానికి సంబంధించి అధికారులతో పుతిన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పర్యావరణ అంశాలకు సంబంధించిన లక్ష్యాలపై ఒక క్రమ పద్దతిలో పనిచేయడం ముఖ్యం అని పుతిన్ అధికారులకు సూచించారు. ఇక, సైబీరియా అడవుల్లో ప్రతి ఏడాది వేసవిలో మంటలు చెలరేగడం సాధరణమే అయినస్పటికీ.. ఇటీవలి సంవత్సరాల్లో మంటలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులే ఇందుకు కారణమని అధికారులు, పర్యావరణవేత్తలు భావిస్తున్నారు.

    పుతిన్ నిర్వహించిన ఈ సమావేశంలో.. కార్చిచ్చు ప్రభావిత సైబీరియన్ ప్రాంతాలకు చెందిన నాయకులు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న దక్షిణ రష్యా ప్రాంతం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. ‘దక్షిణ రష్యాలో ఒక నెలలో నమోదు కావాల్సిన వర్షపాతం.. కొన్ని గంట్లోనే కురుస్తోంది. మరోవైపు ఇందుకు విరుద్ధంగా తూర్పు ప్రాంతంలో పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కరువు పరిస్థితుల్లో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుంది’అని అన్నారు.

    అగ్ని ప్రమాదాల ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ఎక్కువ మంది ప్రజలను ఖాళీ చేయించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని పుతిన్ ఆదేశించారు. అలాగే వారికి ఆర్థిక సాయం కూడా అందజేయాలని అన్నారు. మంటల వల్ల జరిగిన నష్టంపై, ప్రభావంపై నివేదికలు రూపొందించాలని.. మంటల్లో కాలిపోయిన ఇళ్ల పునర్నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఆయన అధికారులకు సూచించారు.

    ఇక, ఈ వారంలో రష్యా.. నేషనల్ రెస్పాన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. సైబీరియన్ అడవుల్లో మంటలను ఎదుర్కొవడానికి అదనపు అగ్నిమాపక సిబ్బందిని నియమించింది. ఇక, కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో యాకుటియా ముందు వరుసలో నిలిచింది. ఇక్కడ 9.4 మిలియన్ హెక్టార్లలో అటవీ సంపద అగ్నికి ఆహుతైంది.
    Published by:Sumanth Kanukula
    First published: