VIRTUAL MEETING BETWEEN PM NARENDRA MODI AND US PRESIDENT JOE BIDEN PAH
Modi and biden: ప్రధాని మోదీ తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వర్చువల్ మీటింగ్.. కారణం ఏంటంటే..
ప్రధానిమోదీ, జో బిడైన్ వర్చువల్ భేటీ
Virtual meeting: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సోమవారం వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో ఉక్రెయిన్, రష్యా యుద్దంతో పాటు.. అనేక అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తుంది.
PM Narendra Modi and US President Joe Biden Virtual meeting: భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జో బైడెన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ పై చేస్తున్న దాడులపై, తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు శాంతి, సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకొవాలని సూచించారు. ఇప్పటికే లక్షలాది మంది అమాయకులు యుద్దంలో ప్రాణాలు కోల్పోయారని, మరేందరో నిరాశ్రయులయ్యారని బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచం కరోనా, ఆర్థిక సంక్షోభాలు, పలు యుద్దాల వంటి వాటితో పలు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తాము ఎల్లప్పులు శాంతి కాముకులమని అన్నారు. ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో మాట్లాడినట్లు తెలిపారు. చర్చలు, దౌత్య వేత్తలు, మధ్య వర్తులతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించామని తెలిపారు. కొన్ని వారాల క్రితం, ఉక్రెయిన్లో 20,000 మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయారు, వారిలో ఎక్కువ మంది యువ విద్యార్థులున్నారని మోదీ అన్నారు. వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు.
Today, our interaction is being held at a time when the situation in Ukraine is a matter of concern. A few weeks back, over 20,000 Indians were stranded in Ukraine, most of them were young students: PM Narendra Modi in virtual interaction with US President Joe Biden pic.twitter.com/f240Bzz9n5
ఈ రోజు వర్చువల్ విధానంలో.. మీతో మరియు మీ ఇద్దరు మంత్రులు మరియు మీ రాయబారితో వర్చువల్గా మాట్లాడే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని బైడెన్ అన్నారు. ప్రపంచ సంక్షోభాలు, కరోనాపై కలిసి పోరాడుతున్నామని బిడేన్ అన్నారు. ఇక ప్రధాని మోదీ, ఉక్రెయిన్ లో ప్రస్తుతం పరిస్థితి తీవ్ర ఆందోళన కరంగా ఉందన్నారు. బుచా మారణాకాండ దారుణమని మోదీ అన్నారు. ఉక్రెయిన్ కు ప్రపంచదేశాలు బాసటగా నిలిచి తమవంతు సహాకారం అందించాలని మోదీ అన్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.