Unity22: వర్జిన్ గెలాక్టిక్ ప్రయోగం సూపర్ సక్సెస్...ఇక నుంచి అందరూ అంతరిక్షానికి వెళ్లొచ్చు..

నింగిలోకి వెళ్లిన టీమ్

వీఎస్ఎస్ యూనిటీ అనే వ్యోమనౌక దాదాపు 15000 ఎత్తుకు వీరందరినీ తీసుకెళ్లింది. అనంతరం ఎలాంటి అవాంతరాలలు లేకుండా భూమిపైకి తీసుకొచ్చింది.

  • Share this:
    ఇక నుంచి అందరూ అంతరిక్షంలోకి వెళ్లవొచ్చు. భూమిపైకి విహారయాత్రకు వెళ్లినట్లుగానే ఆకాశంలోకి వెళ్లి అలా విహరించవచ్చు. ఆకాశ వీధిలో ఇవాళ చారిత్రత్మాక ఘట్టం ఆవిష్కృతమయింది. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన యూనిటీ 22 అంతరిక్ష ప్రయాణం విజయవంతమయింది. ఈ కంపెనీకి చెందిన ఆరుగురు సభ్యుల బృందం అంతరిక్షానికి వెళ్లి మళ్లీ విజయవంతంగా భూమికి చేరుకుంది. రోదసీకి వెళ్లిన 90 నిమిషాల తర్వాత మళ్లీ తిరిగొచ్చారు. వీఎస్ఎస్ యూనిటీ అనే వ్యోమనౌక దాదాపు 15000 ఎత్తుకు వీరందరినీ తీసుకెళ్లింది. అనంతరం ఎలాంటి అవాంతరాలలు లేకుండా భూమిపైకి తీసుకొచ్చింది.


    వీఎస్ఎస్ యూనిటీ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా ప్రయాణించింది. వర్జిన్ గెలాక్టిక్ చేపట్టిన యూనిటీ 22 అంతరిక్ష యాత్ర ఇవాళ ముగిసింది. వాతావరణంలో మార్పుల కారణంగా అనుకున్న సమయం కంటే గంటన్నర ఆలస్యంగా ప్రయోగం ప్రారంభమయింది. న్యూ మెక్సికో నుంచి స్పేస్ ఫ్లైట్ నింగిలోకి ఎగిరింది. వీవీఎస్ యూనిటీ స్పేస్ ఫ్లైట్‌లో వర్జిన్ గెలాక్టిక్ రిచర్డ్ బ్రాన్సన్, చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్‌స్ట్రక్టర్ బెత్ మోసెస్, వర్జిన్ గెలాక్టిక్ లీడ్ ఆపరేషన్స్ ఇంజినీర్ కొలిన్ బెన్నెట్, శిరీష బండ్ల వెళ్లారు. ఈ వ్యోమనౌకకు డేవ్ మెకేయ్, మైఖేల్ మసూకి పైలెట్లుగా వ్యవహరించారు.

    కల్పానా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న రెండో భారతీయులు శిరీష బండ్ల కావడం విశేషం. అంతేకాదు అంతరిక్షంలోకి వెళ్తున్న ఫోర్త్ ఇండియన్‌గా చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి ప్రజలను విహారయాత్రకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంలో వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ యూనిటీ 22 ప్రాజెక్టును చేపట్టింది. తన కంపెనీకి చెందిన 22న వ్యోమనౌక నింగిలోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రయోగానికి యూనిటీ 22 అని పేరుపెట్టారు. అంతరిక్షానికి వెళ్లేందుకు వీఎస్ఎస్ యూనిటీ పేరుతో ప్రత్యేక వ్యోమనౌకను రూపొందించారు. ఇందులో వెళ్లేందుకు 600 మంది రిజిస్టర్ చేసుకోగా.. మొదట కంపెనీకి చెందిన ఆరుగురు ప్రతినిధులు నింగిలోకి వెళ్లారు.

    శిరీషా వయసు 34 ఏళ్లు. ఆమె తల్లిదండ్రులది గుంటూరు జిల్లా. ఈమె గుంటూరులోనే పుట్టారు. కానీ అమెరికాలో పెరిగారు. నాలుగేళ్ల వయసు నుంచి హ్యూస్టన్‌లో ఉంటున్నారు. పర్డ్యూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. జార్జ్‌టౌన్ యూనివర్సిటి నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా పొందారు. 2015లో వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా బండ్ల శిరీష చేరారు. అప్పటినుండి వర్జిన్ ఆర్బిట్ కోసం వాషింగ్టన్ కార్యకలాపాలను నిర్వహిస్తూ అనేక ఉన్నత ర్యాంకులను సొంతం చేసుకున్నారు. ఇవాళ ‘వర్జిన్ గెలాక్టిక్’వ్యోమనౌకలో వెళ్లి చరిత్ర సృష్టించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: