అమెరికాకు చెందిన ప్రముఖ స్పేస్ ఫ్లైట్ కంపెనీ 'వర్జిన్ గెలాక్టిక్' చేపట్టిన 'యూనిటీ 22' ప్రయోగానికి సర్వం సిద్ధమయింది. జులై 11న న్యూ మెక్సికో నుంచి 'VSS యూనిటీ' వ్యోమ నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఫ్లైట్‌లో మొత్తం ఆరుగురు ప్రయాణించనున్నారు. అమెరికా కుబేరుడు, వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్, చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్‌స్ట్రక్టర్ బెత్ మోసెస్, వర్జిన్ గెలాక్టిక్ లీడ్ ఆపరేషన్స్ ఇంజినీర్ కొలిన్ బెన్నెట్‌తో పాటు తెలుగమ్మాయి, ఆ సంస్థ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలు శిరీష బండ్ల అంతరిక్షంలోకి వెళ్తారు. ఈ వ్యోమనౌకకు డేవ్ మెకేయ్, మైఖేల్ మసూకి పైలెట్లుగా వ్యవహరిస్తారు. వాతావరణం అనుకూలిస్తే షెడ్యూల్ ప్రకారం జులై 11నే ఈ ప్రయోగం జరుగుతుంది. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఉంటే కొన్ని రోజులు వాయిదా పడే అవకాశముంది.
VSS యూనిటీ వ్యోమనౌకలో గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అనే యువతి వెళ్తోందని ఇది వరకే తెలుసు. ఐతే ఆమెతో పాటు మరో భారత సంతతి వ్యక్తి కూడా అంతరిక్షంలోకి వెళ్తున్నారు. ఆయన ఎవరో కాదు రిచర్డ్ ఫ్రాన్స్. అవును.. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్ మూలాలు భారత్‌లో ఉన్నాయి. గతంలో స్వయంగా ఆయనే ఈ విషయాన్ని చెప్పారు. 2019 డిసెంబరులో ముంబై నుంచి లండన్‌కు వర్జిన్ గెలాక్టిక్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభమైన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పూర్వీకులు ఇండియాకి చెందిన వారని.. తాను గతంలో చేయించుకున్న ఓ డీఎన్ఏ టెస్ట్ ద్వారా తెలిసిందని ఆయన చెప్పారు. ఆనంద్ మహింద్రాతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్న రిచర్డ్ బ్రాన్స్.. తన గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వైఫ్ అరియా ఫొటోలను ఆ విమానాలపై ముద్రిస్తున్నట్లు తెలిపారు. ఆమె భారత దేశానికి చెందినవారని ఆ సంద్భంగా రిచర్డ్ బ్రాన్సన్ చెప్పారు.
''మా పూర్వీకులు భారత దేశంలో ఉండేవారని నాకు తెలుసు. కానీ మన బంధాలు ఇంత బలంగా ఉంటాయని నేను అనుకోలేదు. 1793 సమయంలో మా పూర్వీకులు తమిళనాడులోని కడలూరులో నివసించేవారు. మా ముత్తాత తాత తాత భార్య ఇండియాకు చెందిన వారు. ఆమె పేరు అరియా. మా గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్‌ని ఆమె పెళ్లి చేసుకున్నారు. అందుకే ఇండియాలో నేను ఎవరినైనా కలిస్తే.. బహుశా మనం బంధువులం కావచ్చు. అని సరదాగా అంటుంటాను.'' అని ఆ కార్యక్రమంలో రిచర్డ్ బ్రాన్సన్ పేర్కొన్నారు.
View this post on Instagram
అంతరిక్షంలోకి ప్రజలను విహారయాత్రకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంలో వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ యూనిటీ 22 ప్రాజెక్టును చేపట్టింది. తన కంపెనీకి చెందిన 22న వ్యోమనౌక నింగిలోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రయోగానికి యూనిటీ 22 అని పేరుపెట్టారు. అంతరిక్షానికి వెళ్లేందుకు వీఎస్ఎస్ యూనిటీ పేరుతో ప్రత్యేక వ్యోమనౌకను రూపొందించారు. ఇందులో వెళ్లేందుకు 600 మంది రిజిస్టర్ చేసుకోగా.. జులై 11న ఆరుగురు వెళ్తున్నారు.
ఇది కూడా చదవండి:
Sirisha Bandla: రేపే వర్జిన్ గెలాక్టిక్ ప్రయోగం.. అంతరిక్షంలోకి వెళ్తున్న తెలుగుమ్మాయి శిరీష
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.