• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • VIRAL VIDEOS WATCH THESE TWO SUPER CHASING VIDEOS OF GIRAFFE AND HIPPOPOTAMUS THEY ARE VIRAL ON SOCIAL MEDIA NK

Viral Videos: సూపర్ ఛేజింగ్స్... అడవిలో, నీటిలో... రెండు వైరల్ వీడియోలు చూడండి

Viral Videos: సూపర్ ఛేజింగ్స్... అడవిలో, నీటిలో... రెండు వైరల్ వీడియోలు చూడండి

సూపర్ ఛేజింగ్స్... అడవిలో, నీటిలో (images credit - youtube and twitter)

Viral Videos: వైరల్ వీడియోలను మీరు బాగా ఎంజాయ్ చేస్తారా... వైల్డ్ లైఫ్ అంటే మీకు ఇష్టమా... అయితే... ఈ రెండు వీడియోలూ మీకు బాగా నచ్చుతాయి. టెన్షన్ టెన్షన్ కలిగిస్తాయి. థ్రిల్ వస్తుంది.

  • Share this:
    Viral Videos: సోషల్ మీడియా ఉన్నంత కాలం... మనకు వైరల్ వీడియోలు చూసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెటిజన్లు రకరకాల వైరల్ వీడియోలను మనతో పంచుకుంటూ... అవి అందరికీ చేరేలా చేస్తున్నారు. మన రెండు వీడియోల్లో మొదటిది కెన్యాకి సంబంధించినది. ఇందులో... కంత మంది టూరిస్టులు విక్టోరియా సరస్సులో స్పీడ్ బోటుతో రైడింగ్‌కి వెళ్లారు. ఓ చోట వారికి 4 నీటి ఏనుగులు (Hippos) కనిపించాయి. వాటికి దగ్గరగా వెళ్లారు. జనరల్‌గా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండని అవి... స్పీడ్ బోట్ రాగానే కంగారుపడ్డాయి. ఓ హిప్పో... ఆ బోటును ఛేజ్ చేసింది. స్పీడ్ బోట్ ఎంత వేగంగా వెళ్తే... అంతే వేగంగా ఈదుతూ... దూసుకొచ్చింది. చాలా దూరం వెంబడించాక... అది వాళ్లను వదిలేసింది.

    ఈ హిప్పో ఛేజింగ్ వీడియోను ఇక్కడ చూడండి.

    బాగుంది కదా... ఇక రెండో వీడియో సంగతి చూద్దాం. ఇది కూడా కెన్యాలో జరిగిందే. అక్కడి కెన్యా సఫారీలో... జీపులో వెళ్తున్న టూరిస్టులను జిరాఫీ ఛేజ్ చేసింది. అసలే అది డబుల్ డెక్కర్ బస్సులా అంతుంటుంది. ఈజీగా పరుగెడుతూ వెంబడించింది. వాళ్లు ఎంత వేగంగా పారిపోదామన్నా వాళ్ల వల్ల కాలేదు. కాసేపు వెంటపడిన జిరాఫీ... వాళ్లను దాటుకొని మరీ ముందుకు వెళ్లింది. ఎక్కడికి పారిపోతారు అన్నట్లుగా జీప్ ఎదురుగా వెళ్లి... అడ్డంగా నిల్చుంది. దాంతో... వాళ్లు బ్రేక్ వేయాల్సి వచ్చింది. కాసేపు వాళ్లను ఆడుకున్న జిరాఫీ తర్వాత వదిలేసిందని తెలిసింది. ఆ వీడియో ఇక్కడ చూడండి.



    ఇది కూడా చదవండి: Viral Video: నాలుగేళ్ల చిన్నారి... జోలపాడింది... ఇంతకీ ఆ జంతువేంటో తెలుసా?

    బాగున్నాయి కదా రెండు వీడియోలు. వీటికి రెస్పాన్స్ చాలా బాగుంది. వైల్ట్ లైఫ్ థ్రిల్ చూపించాయని నెటిజన్లు అంటున్నారు. వన్యప్రాణులను డిస్టర్బ్ చేస్తే... వాటికి కోపం వస్తుందనీ... కానీ చాలా సందర్భాల్లో అవి ఇలాగే హాని చెయ్యకుండానే వదిలేస్తాయని వైల్డ్ లైఫ్ పై అవగాహన ఉన్నవారు చెబుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు