VIRAL VIDEO UTAH DIVISION OF WILDLIFE RESOURCES DROPPED LIVE FISH FROM PLANES HERE IS WHY NK
Video: ఆకాశం నుంచి చేపలు.. అసలు కథ వేరే ఉందిలే...
Video: ఆకాశం నుంచి చేపలు.. (image credit -
Video: ఆకాశం నుంచి అలా కుప్పలు కుప్పలుగా చేపలు పడుతున్న వీడియో నెటిజన్లకు బాగా నచ్చుతోంది. ఇలాంటివి మరిన్ని జరగాలని వారు కోరుకుంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం.
Video: అమెరికాలో టోర్నడోలు వచ్చినప్పుడు అవి సముద్రంలో లేదా సరస్సుల్లో నీటిని గుండ్రంగా చుట్టుకుంటూ ఆకాశంలోకి తీసుకుపోయి... మరెక్కడో వేరే భూమిపై ఆ నీటిని వర్షంలా వదిలేస్తాయి. అలా వదిలేసినప్పుడు... ఆ నీటిలో చిక్కుకున్న చేపలు నేలపై పడతాయి. అప్పుడు ఆకాశం నుంచి చేపలు పడినట్లుగా మనం ఫీలవుతాం. అదో థ్రిల్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అది కాదు. అలాంటిదే మరో రకం. ఇది కూడా అమెరికాకు సంబంధించిన న్యూసే. అక్కడ విమానం ద్వారా... ఆకాశం నుంచి చేపల్ని నదుల్లోకి వదిలేస్తున్నారు. ఉతా డివిజన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రిసోర్స్ వారు... ఈ కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఎందుకో తెలుసుకుందాం.
మత్య్స వనరులను పెంచేందుకు... మన దేశంలో నదుల్లో చేప పిల్లల్ని వదలడం సహజం. అమెరికాలో చాలా సరస్సులు ఉన్నా... వాటిలో ఇలా విడివిడిగా చేపల్ని వదలాలంటే... కొన్ని నెలల సమయం పడుతుంది. అందువల్ల వారు టెక్నాలజీని వాడేస్తున్నారు. విమానంలో చేపల్ని తీసుకెళ్లి... నదులు, సరస్సులు ఉన్నచోట... పై నుంచి జార విడుస్తున్నారు. నీటితోపాటూ... కిందికి జారే ఆ చేపలు... నదుల్లో పడి... కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాయి. తద్వారా... ఆయా నదుల్లో భారీగా చేపల వనరులు పెరిగేందుకు వీలు కలుగుతోంది. అందుకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశారు. ఆ వీడియో ప్రకారం... అమెరికా వ్యాప్తంగా 200 సరస్సుల్లో చేపల్ని వదిలారు.
ఆ అద్భుతమైన వీడియోను ఇక్కడ చూడండి.
ఒకసారి ప్లేన్ బయలుదేరితే... అందులో.... 35,000 చేపల్ని తీసుకెళ్తున్నారు. అక్కడి చుట్టుపక్కల ఏయే సరస్సులు ఉన్నాయో గుర్తించి... వెంటనే వాటిలో చేపల్ని వదిలేస్తున్నారు. ఇలా దేశమంతా చేస్తున్నారు. చార్టర్డ్ విమానంలో నీటితో చేపల్ని తీసుకెళ్లడం వల్ల వాటికి ఎలాంటి ప్రాణహానీ జరగట్లేదని అధికారులు తెలిపారు.
చేపల్ని వదిలే సరస్సుల్లో చాలా వాటి దగ్గరకు వాహనాలు వెళ్లేందుకు దారి లేదు. అందుకే అక్కడ 1 నుంచి 3 అంగుళాల చేపల్ని ఇలా వదలేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు 1950 నుంచి ఉతా డివిజన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రిసోర్స్ వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనిపై నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది వీడియో చూసి మెచ్చుకుంటున్నారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.