• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • VIRAL VIDEO SECURITY GUARD REJECTS HER TO ENTER INTO STORE FOR NOT TO WEAR MASK THEN WHAT SHE DID WATCH VIRAL VIDEO NK

Viral video: మాస్క్ పెట్టుకోని మహిళ.. సెక్యూరిటీ గార్డుతో గొడవ.. రచ్చ రచ్చ.. బండబూతులు

Viral video: మాస్క్ పెట్టుకోని మహిళ.. సెక్యూరిటీ గార్డుతో గొడవ.. రచ్చ రచ్చ.. బండబూతులు

మాస్క్ పెట్టుకోని మహిళ.. సెక్యూరిటీ గార్డుతో గొడవ (image credit - youtube)

Viral video: ఇలాంటివి చూసినప్పుడు... మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది కదా... ఈ గొడవంతా ఎందుకు అనిపించడం సహజం. ఆ మహిళ మాత్రం మాస్క్ అంటే చాలు.. రెచ్చిపోతోంది. వీడియో చూస్తే షాకే.

  • Share this:
    Viral video: ఈ ప్రపంచంలో మాస్క్ పెట్టుకోవడం అవసరం అనేవారు ఉన్నట్లే... మాస్క్ వేస్ట్ అనేవారూ ఉన్నారు. మన దేశంలో అందరం మాస్కులు పెట్టుకుంటూ... ఎంతో జాగ్రత్తగా కరోనాను సాగనంపుతుంటే... విదేశాల్లో మాత్రం కొంత మంది మాస్కుల పట్ల వ్యతిరేకత చూపిస్తున్నారు. అలాంటి ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. దారిన పోయే వాళ్లంతా... ఆగిపోయి... మొబైల్స్‌తో వీడియోలు రికార్డు చేసుకునే పరిస్థితి వచ్చింది. అంతలా రచ్చ రంబోలా చేసింది ఆ మహిళ. మామూలుగా తిట్టలేదు. బండ బూతులు తిట్టింది. వాటిని వినలేక... చాలా మంది చెవులు మూసుకునే పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందో, ఎందుకు అంతలా రెచ్చిపోయిందో చూద్దాం.

    ఈ ఘటన జరిగింది లండన్‌లో. అక్కడి ఓ స్టోర్‌ (Harrods department store)లోకి మాస్క్ లేకుండా వెళ్తుంటే... ఆ మహిళను సెక్యూరిటీ గార్డు ఆపేశాడు. మాస్క్ లేకపోతే... లోపలికి ఎంట్రీ లేదని పద్ధతిగా చెప్పాడు. అంతే... ఆమె గట్టిగా అరుస్తూ "నేను ఏ తప్పూ చెయ్యలేదు" అంది. దానికీ మాస్కుకీ సంబంధం ఉందా. అయినా సరే... సెక్యూరిటీ గార్డు సుతి మెత్తగానే... లేదు మేమ్... మాస్క్ మస్ట్... పెట్టుకోవాల్సిందే అన్నాడు. అంతే రెచ్చిపోయింది. బండ బూతులు తిట్టింది. నానా రభస చేసింది. అదంతా చూస్తూ అక్కడున్న ఇతరులు గబగబా మొబైల్స్ తీసి... వీడియో షూట్ చేశారు.

    సెక్యూరిటీ గార్డుకు మద్దతుగా మరో ఇద్దరు రావడంతో... ఆ మహిళ తాలూకు మరో ఇద్దరు మహిళలు గొడవకు తలపడ్డారు. చిన్నపాటి యుద్ధం జరిగింది. అతనిపై ఉమ్మి (spat) వేసింది. అక్కడి నుంచి పారిపోతుంటే... ఆ మహిళను వెంటాడి పట్టుకున్నారు సెక్యూరిటీ గార్డులు. ఆ వీడియో ఇదే. ఇక్కడ చూడండి.

    చివరకు ఏమైంది అనే డౌట్ మనకు వస్తుంది. ఆమెను పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెను అరెస్టు చేసి తీసుకెళ్లారు.

    ఇది కూడా చదవండి: Business Ideas: చిన్న వ్యాపారం... మంచి లాభాలు... ఇది చేస్తే... మీపై ప్రశంసల జల్లే...

    ఈ ఘటనపై స్టోర్ నిర్వాహకులు స్పందించారు. ఇలాంటివి జరుగుతాయని తెలిసే... మేమ్ మా సెక్యూరిటీ గార్డులకు పూర్తి ట్రైనింగ్ ఇచ్చాం. రూల్స్ పాటించే విషయంలో మేం రాజీ పడం. ఎవరైనా సరే మాస్క్ పెట్టుకోవాల్సిందే. ఇలా మిస్ బిహేవ్ చేస్తే ఉరుకునే ప్రసక్తే లేదు అని తెలిపారు.
    Published by:Krishna Kumar N
    First published: