• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • VIRAL VIDEO NORTH CAROLINA COUPLE FACE BOBCAT STRANGE INCIDENT VIDEO GOES SUPER VIRAL ON SOCIAL MEDIA WITH 12 MILLION VIEWS NK

Viral Video: పిల్లిలా కనిపించిన అడవి పిల్లి.. దెయ్యంలా అరిచి ఏం చేసిందో వీడియో చూడండి

Viral Video: పిల్లిలా కనిపించిన అడవి పిల్లి.. దెయ్యంలా అరిచి ఏం చేసిందో వీడియో చూడండి

పిల్లిలా కనిపించిన అడవి పిల్లి (image credit - twitter)

Viral Video: పిల్లికీ, అడవి పిల్లికీ తేడా ఏంటి?... అది దెయ్యంలా ఎందుకు అరిచింది?... ఆ తర్వాత అక్కడి వారు దాన్ని చూసి ఎందుకు పరుగులు పెట్టారు? ఆ తర్వాత ఏమైంది? తెలుసుకుందాం.

  • Share this:
    "ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు".. అంటూ వేమన ఎప్పుడో చెప్పారు... తెల్లనివన్నీ పాలు... నల్లనివన్నీ నీళ్లు అనుకోవద్దని. పిల్లి, పులి చూడటానికి ఒకేలా ఉంటాయి. పిల్లి చిన్నగా, పులి పెద్దగా ఉండటం వల్ల ఏది పిల్లో, ఏది పులో మనం గుర్తించగలం. ఐతే... పిల్లుల్లో అడవి పిల్లులు కూడా ఉంటాయి. అవి ఇళ్లలో తిరిగే పిల్లిలాగే ఉంటాయి. కాకపోతే... కొద్దిగా పెద్ద సైజు పెరుగుతాయి. అలాంటి పిల్లి గనుక ఇళ్లలోకి వస్తే... అది అడవిపిల్లి అని మనం గుర్తు పట్టలేం. అందుకే... పిల్లల్ని జూకి తీసుకెళ్లి... జంతువుల మధ్య తేడాలను క్లియర్‌గా తెలుసుకునేలా చేస్తారు పెద్దలు. తాజా ఘటనలో ఓ అడవి పిల్లి... ఇళ్లలో పిల్లిలా కనిపించి... షాక్ ఇచ్చింది. అసలు విషయం తెలిశాక... నానా హంగామా జరిగింది.

    అసలేమైందంటే... ఉత్తర కాలిఫోర్నియాలోని పెండర్ కౌంటీలో ఓ ఫ్యామిలీ నివసిస్తోంది. గత శుక్రవారం ఏప్రిల్ 9న ఆ జంట... ఎక్కడికో పార్క్ లాంటి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ గార్డెన్ లాంటి చోట తమ కారు ఆపారు. అక్కడ కారు దిగి ఏవో పనులు చేసుకుంటుంటే.. కొన్ని క్షణాలకు పెద్దయన భార్య కారు దగ్గరకు వస్తూ ఉంది. ఇంతలో దెయ్యం అరిచినట్లుగా "ఆఆఆఆవవ్‌వ్‌వ్‌వ్" అని ఓ అరుపు ఆమెకు వినిపించింది. అదేంటా అని అరుపు వినిపించిన కిందివైపు ఆమె చూసింది. ఇంతలో... ఆమె కాళ్లకు అడ్డుగా వచ్చింది ఓ పిల్లి. అసలే ఆమెకు పిల్లులంటే భయం. వామ్మో పిల్లి అనుకుంటూ ఆమె కంగారుగా అక్కడి నుంచి పారిపోయింది.

    bobcat
    అడవి పిల్లి (image credit - wikipedia)


    ఆమె భర్తకు పిల్లులంటే ఏమాత్రం భయం లేదు. పెద్ద కుందేలు సైజులో ఉంది ఈ పిల్లి అంటూ దాన్ని ఎత్తుకున్నాడు. గాల్లోకి లేపాడు. అప్పుడు అర్థమైంది తాను పట్టుకున్నది పిల్లి కాదని... అడవి పిల్లి (Bobcat) అని. వెంటనే దాన్ని గాల్లోనే విసిరేశాడు. అది 20 అడుగుల అవతలకు వెళ్లి పడింది. కానీ దానికి ఏ దెబ్బా తగల్లేదు. వెంటనే అది రివర్స్ పరుగెడుతూ వచ్చి కారు కిందకు దూరింది. ఆ పిల్లిని కాల్చిపడేస్తా అంటూ అతను గన్ తీసి ఫైరింగ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. అది మీరూ చూడండి.



    ఇది కూడా చదవండి: No Mask Video: మాస్క్ లేకుండా యువతి... పోలీసులతో గొడవ... ఏం చేస్తారు అంటూ ఫైర్

    ఈ వీడియో సూపర్ వైరల్ అయ్యింది. ఇప్పటికే దీన్ని కోటి 20 లక్షల మంది చూశారు. నిజానికి ఈ వీడియోలో ఆ పిల్లి తప్పేమీ లేదు. తప్పంతా ఆ దంపతులదే. ఎందుకంటే... ఆ పిల్లి తరచూ తిరిగే ప్రదేశానికి వాళ్లు వెళ్లారు. అదంతా దాదాపు అడవి లాంటి ప్రాంతం. అలాంటి చోటికి వాళ్లు వెళ్లారు. వెళ్లడమే కాక... ఆ అడవి పిల్లిని గాల్లో విసిరేశాడు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అలా విసిరేయడానికి మనసెలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. దాన్ని సంరక్షణా కేంద్రానికి తరలించి ఉంటే సరిపోయేది అని సూచిస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు