• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • VIRAL VIDEO HOW A DOG STEALS MIC FROM A FEMALE REPORTER IN MOSCOW ON A LIVE WEATHER REPORT WATCH VIDEO NK

Viral video: టీవీ లైవ్‌లో షాక్... రిపోర్టర్ మైక్ ఎత్తుకుపోయిన కుక్క... ఆ తర్వాత...

Viral video: టీవీ లైవ్‌లో షాక్... రిపోర్టర్ మైక్ ఎత్తుకుపోయిన కుక్క... ఆ తర్వాత...

రిపోర్టర్ మైక్ ఎత్తుకుపోయిన కుక్క...(image credit - twitter)

Viral video: ఈ వైరల్ వీడియోను జర్నలిస్ట్ అలీ ఒజ్కోక్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుతున్నారు. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకుందాం. వీడియో చూద్దాం.

  • Share this:
    Viral video: కుక్కలకు ఏదైనా పొడుగ్గా కనిపిస్తే... దాంతో ఆడుకోవాలి అనుకుంటాయి. దాన్ని ఓ ఎముకలా ఫీల్ అవుతాయి. ఆ రిపోర్టర్ యాంకర్ చేతిలోని మైక్ కూడా ఆ కుక్కకు అలాగే అనిపించిందేమో. లైవ్ ఇస్తుండగా లాక్కుపోయింది. ఇది జరిగింది రష్యా రాజధాని మాస్కోలో. అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. అలాంటి చోట... రిపోర్టర్ నాదెజ్దా సెరెజ్కినా... దేశంలోని వాతావరణ మార్పులపై లైవ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అప్పుడే న్యూస్ రూమ్ నుంచి యాంకర్ ఓ ప్రశ్న అడగ్గా... రిపోర్టర్ లైవ్ ఇస్తుంటే... ఎక్కడి నుంచి వచ్చిందోగానీ గోల్డెన్ రిట్రీవర్ కుక్క... ఒక్కసారిగా ఆమెపైకి ఉరికి... ఆమె చేతిలోని మైక్‌ని నోటితో కరచుకుంది. కుక్క మీదకు రావడంతో కంగారు పడిన ఆమె... మైక్‌ని గట్టిగా లాక్కోలేకపోయింది.

    నోటికి అందిన దాన్ని కుక్క వదులుతుందా... అలా పట్టుకొని వెళ్లిపోయింది. అయ్యో మైకు... మైకు అంటూ... ఆమె కుక్ వెంట పరుగులు పెట్టింది. దాంతో లైవ్ పోయింది. ఇదంతా చూసిన యాంకర్‌, కెమెరామేన్‌ షాకయ్యారు. రిపోర్టర్ నుంచి ఏదో ఆశిస్తే... ఇంకేదో అవ్వడంతో... యాంకర్ ముఖంలో రంగులు మారిపోయాయి. వీడియోలో ఆ దృశ్యాన్ని మనం చూడొచ్చు. ముందు వీడియో చూసేద్దాం.


    నిజానికి ఇలా జరగడం ఆ టీవీకి కలిసొచ్చింది. కుక్క నుంచి మైక్‌ని తిరిగి తీసుకున్నారు. కాకపోతే... కుక్క దంతాల గుర్తులు మైక్ పై ఉన్నాయి. అదే సమయంలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే దీన్ని కోటి మందికి పైగా చూశారు. దాంతో ఆ ఛానెల్ హాట్ టాపిక్ అయ్యింది.

    ఇది కూడా చదవండి: Fish Recipe: నోరూరించే నెల్లూరు చేపల పులుసు... ఒక్కసారి తింటే... జీవితంలో వదలరు

    ఈ వీడియో చాలా బాగుందని నెటిజన్లు అంటున్నారు. కొంత మంది ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఓ యూజర్... "రష్యాలో కుక్కలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాయి" అని రాయగా... కుక్క వస్తున్నప్పుడు చూసుకోవాలిగా అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇంకా రకరకాలుగా స్పందిస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: