హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

భారీ చేపను నీటిలో వదిలేసిన చిన్నారి... నెటిజన్ల ప్రశంసలు... వైరల్ వీడియో

భారీ చేపను నీటిలో వదిలేసిన చిన్నారి... నెటిజన్ల ప్రశంసలు... వైరల్ వీడియో

Viral Video : తను పట్టుకున్న చేపను తండ్రికి చూపించి ఎంతో ఆనందపడిన ఆ చిన్నారి... తిరిగి దాన్ని నీటిలో వదిలెయ్యడం ఆ తండ్రికి ఎంతో నచ్చింది.

Viral Video : తను పట్టుకున్న చేపను తండ్రికి చూపించి ఎంతో ఆనందపడిన ఆ చిన్నారి... తిరిగి దాన్ని నీటిలో వదిలెయ్యడం ఆ తండ్రికి ఎంతో నచ్చింది.

Viral Video : తను పట్టుకున్న చేపను తండ్రికి చూపించి ఎంతో ఆనందపడిన ఆ చిన్నారి... తిరిగి దాన్ని నీటిలో వదిలెయ్యడం ఆ తండ్రికి ఎంతో నచ్చింది.

  అమెరికా... ఫ్లోరిడాలో జరిగిందీ ఘటన. తన తండ్రితో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లాడు కెమారీ. అనుకోకుండా ఆ చిన్నారికి... దాదాపు 3 కేజీల బరువున్న చేప చిక్కింది. ఇదివరకు ఎప్పుడూ ఆ చిన్నారి అంత పెద్ద చేపను పట్టుకోలేదు. తాను సాధించిన ఘనకార్యాన్ని తన తండ్రికి చూపించి ఎంతో ఆనందపడ్డాడు. ఆ తండ్రి కూడా కొడుకు చేతిలో భారీ చేపను చూసి... దాన్ని వీడియో తీశాడు. కొన్ని నిమిషాలకే కెమారీ మనసు మార్చుకున్నాడు. ఈ చేపను వదిలేస్తాను అంటూ... దాన్ని మెల్లగా నీటిలో వదిలాడు. హాయిగా వెళ్లు... మరింత పెద్దగా అవ్వు... అని దాన్ని నిమిరాడు. ఆ చిన్నారి నిమురుతున్నప్పుడు ఆ చేప ఎటూ పారిపోకుండా అలాగే ఉంది. చిన్నారి దాన్ని వదిలి... నీటి లోంచీ బయటకు రాగానే... చేప మెల్లగా వెళ్లిపోయింది. ఇదంతా వీడియో తీసిన తండ్రి... దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే... ఆ వీడియో వైరల్ అయ్యింది.

  ' isDesktop="true" id="344116" youtubeid="GO_ehbQ5PZw" category="international">

  వీడియో చూసిన వాళ్లంతా ఆ చిన్నారి మంచి మనసును మెచ్చుకుంటున్నారు. అంత పెద్ద చేప దొరికితే ఎవరైనా ఫ్రై చేసుకుతింటారు. కానీ ఆ పిల్లాడు మాత్రం దాన్ని తిరిగి వదిలెయ్యడం ఎంతో గొప్ప విషయం అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి చిన్నారి అమెరికా అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నట్లు ఓ నెటిజన్ తెలిపారు. ఆ చిన్నారిది పవిత్రమైన హృదయం అని మరో నెటిజన్ మెచ్చుకున్నారు. ఇలాంటి పిల్లల వల్ల ప్రకృతికి మేలు జరుగుతుందని మరో నెటిజన్ అన్నారు. ఇలా కామెంట్ల వర్షం కురుస్తోంది.

  చిన్నారికి ప్రశంసల జల్లు


  Pics : కొంటె చూపులతో కవ్విస్తున్న బాలయ్య భామ


  ఇవి కూడా చదవండి :

  వీళ్లంతా యూరప్‌లో మోస్ట్ వాంటెడ్ వుమెన్... చేసిన నేరాలు ఇవీ...


  మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది... లెక్కతేల్చిన పురావస్తు తవ్వకాలు

  బీజేపీలో టీడీపీ కలిసిపోతుందా? జీవీఎల్ సంకేతాలు ఇస్తున్నారా?

  నెక్ట్స్ ఏంటి... ఇవాళ తేల్చనున్న ఆర్టీసీ జేఏసీ

  Health Tips : కొబ్బరి నీళ్లతో 20 రకాల ప్రయోజనాలు... తాగితే రోగాలు దరిచేరవు

  Health Tips : సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

  First published:

  Tags: Telugu news, Telugu varthalu, World

  ఉత్తమ కథలు