• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • VIRAL VIDEO DOG RESCUES HER FRIEND DOG FROM DROWNING IN SWIMMING POOL IN JOHANNESBURG OF SOUTH AFRICA WATCH THAT VIDEO NK

Viral Video: స్విమ్మింగ్‌పూల్‌లో పడిన కుక్క.. అరగంట శ్రమించి కాపాడిన మరో కుక్క.. వీడియో

Viral Video: స్విమ్మింగ్‌పూల్‌లో పడిన కుక్క.. అరగంట శ్రమించి కాపాడిన మరో కుక్క.. వీడియో

స్విమ్మింగ్‌పూల్‌లో పడిన కుక్క.. అరగంట శ్రమించి కాపాడిన మరో కుక్క.. (image credit - facebook)

Viral Video: స్విమ్మింగ్ పూల్‌లో ఈత రాని వారు పడిపోతే... ఈత వచ్చిన వారు కాపాడతారు. కానీ అక్కడ కాపాడినది కుక్క. ఇదెలా సాధ్యమైంది. ఓ కుక్క మరో కుక్కను ఎలా రక్షించింది?

  • Share this:
    Viral Video: సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే అంటారే... అది నిజమే కావచ్చు. ఈ కుక్క వీడియో చూసి మనం అలా ఫిక్స్ అవ్వొచ్చు. ఇది జరిగింది... సౌత్ ఆఫ్రికాలోని... జొహాన్నెస్‌బర్గ్‌లో. అక్కడ ఓ ఫ్యామిలీ (బైరన్, మెలిస్సా దంపతులు)కి అదిరిపోయే స్విమ్మింగ్ పూల్ ఉంది. దాన్ని చూస్తే... ఈ ఎండల్లో అందులో దూకి అక్కడే ఉండాలని అనిపించడం సహజం. ఆ విషయం అలా ఉంచితే... మన కథలో హీరో ఓ కుక్క. పేరు జెస్సీ. తన ఫ్రెండైన 15 ఏళ్ల పొమెరానియన్ జాతి కుక్క చక్కీ... చూసుకోకుండా స్విమ్మింగ్‌పూల్‌లో పడింది. కుక్కలు సహజంగానే నీటిలో ఈదగలవు. సో... అది పూల్‌లో పడి ఎలా పైకి రావాలో అర్థం కాక... గిలగిలా, విలవిలలాడుతూ... ఈదుతూ... మూలుగుతూ ఉంది. అది చూసిన జెస్సీ... దాన్ని ఎలాగైనా కాపాడాలని బాగా ఫీలైంది.

    ఈ పూల్‌కి దగ్గర్లోనే ఓ కలర్‌ఫుల్ సీసీ టీవీ కెమెరా ఉంది. అది ఈ మొత్తం స్టోరీని షూట్ చేసింది. చక్కీ చాలాసార్లు పూల్ ఒడ్డుకు వస్తున్నా... పైకి ఎక్కలేకపోతోంది. దాన్ని పైకి లాగడానికి జెస్సీ దగ్గర చేతులు లేవు కదా... సో... ఎలా లాగాలో తెలియక జెస్సీ పడిన బాధ వర్ణనాతీతం.

    ఇక్కడో ట్విస్ట్ ఉంది. జెస్సీకి వాటర్ అంటే భయం. నీరు ఉన్న చోటికి అస్సలు వెళ్లదు. కానీ ఇప్పుడు తన ఫ్రెండ్ ప్రాణాపాయ స్థితిలో ఉండేసరికి తన భయాన్ని పక్కన పెట్టి పోరాడింది. ఇలా అరగంటపాటూ ప్రయత్నించాక... చివరకు చక్కీని తన నోటితో పట్టుకొని... బయటకు లాగేసింది జెస్సీ... ఆ తర్వాత అవి ఆడుకోవడానికి వెళ్లిపోయాయి. ఆ వీడియో ఇక్కడ మీరూ చూడండి.

    ఇంత జరిగినా... ఇంట్లో ఉన్న దంపతులకు ఈ విషయం తెలియలేదు. కాసేపటి తర్వాత చక్కీ తల తడిసినట్లు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు వారికి అసలు విషయం తెలిసింది. జెస్సీని మెచ్చుకున్న ఆ దంపతులు... ఇకపై ఆ మూగ జీవాలకు కష్టం కలగకుండా... అవి స్విమ్మింగ్ పూల్‌లో పడకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని అన్నారు. కావాలంటే స్విమ్మింగ్‌పూల్ మూసేస్తామని అన్నారు.

    ఇది కూడా చదవండి: Perfume and Personality: మీకు ఏ సెంట్ ఇష్టం... పెర్ఫ్యూమ్‌ని బట్టీ పర్సనాల్టీ...

    ఇలాంటి మంచి వీడియో సోషల్ మీడియాలోకి వస్తే నెటిజన్లు ఊరుకుంటారా... వైరల్ చేశారు. చాలా మంది ఆ జెస్సీ కుక్కను మెచ్చుకుంటున్నారు. చాలా తెలివైనది అని పొగుడుతున్నారు. మీకూ అలాగే అనిపిస్తోంది కదూ...
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు