Viral Video: శుభ్రత పాటించడంలో పిల్లులకు తిరుగులేదు. పిల్లిని పెంచుకుంటే... దానికి స్నానాలు, ఇతరత్రా పనులు చేయాల్సిన పనిలేదు. బయటకు తీసుకెళ్లాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే... పిల్లలు తమ పనులు తాము చేసేసుకుంటాయి. అంతేకాదు... పెంపుడు పిల్లులు... పర్మిషన్ లేకుండా వస్తువుల్ని ముట్టుకోవు. రహస్యంగా పాలు తాగడాల వంటివి చెయ్యవు. ఏం చేసినా తన ఓనర్నే అడుగుతాయి. ఎలుకల్ని వేటాడి తినే విషయంలో మాత్రం ఎవరి పర్మిషన్లూ తీసుకోవు. రంగంలోకి దిగడం, వేటాడటం, తినడం అన్నీ జరిగిపోతాయి. సోషల్ మీడియాలో పిల్లులకు సంబంధించి ఎన్నో ఫన్నీ వీడియోలు మనం చూస్తూ ఉంటాం. అలాంటి మరో వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది.
పిల్లులకు వంద రకాలుగా అరవడం వచ్చు. వాటి ముఖంలో వేర్వేరు రకాల ఎక్స్ప్రెషన్స్ పెట్టగలవు. కోపం, భయం, బాధ, జాలి, బుంగమూతి... ఇలా పిల్లులు చేసే హావభావాలు అందరికీ నచ్చుతాయి. అమాయకంగా నటిస్తూనే... తమకు కావాల్సినవి పొందడంలో పిల్లులకు తిరుగులేదు. ఈ వీడియోలో పిల్లి... ఫుడ్ తినాలనుకుంది. దాని ఓనర్... "నీకు తినాలని ఉందా" అని అడిగితే... పిల్లి "మ్యావ్" (అవును) అంది. తన ఓనర్ తనకు ఫుడ్ పెడుతుందని అనుకుంది. ఐతే... ఓనర్ ఫుడ్ పెట్టలేదు. "ఇది తినే టైమ్ కాదు... ఇప్పుడేగా తిన్నావ్" అంది. దాంతో పిల్లి నీరసించిపోయింది. "అయ్యో నాకు ఆహారం పెట్టట్లేదే" అనుకుంటూ బుంగమూతి పెట్టుకొని... తల కిందకు దించుతూ... తప్పుచేసిన దానిలా ఫీలైంది. ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుతున్నారు. ఆ వీడియో మీరూ చూడండి.
Poor kitty..
Sound on.. pic.twitter.com/Hhm8JrB9R1
— Buitengebieden (@buitengebieden_) April 17, 2021
కొన్ని గంటల కిందటే పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే 38వేల మందికి పైగా చూశారు. 2600పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. దానికి మళ్లీ ఫుడ్ పెట్టాలని కోరుతున్నారు. తామైతే పెట్టేవాళ్లం అని అంటున్నారు.
This kitty would be eating again if it was mine!
— Eileen aka RedHeadedResister (@evelez704) April 17, 2021
పిల్లులకు సంబంధించి మరిన్ని ఫన్నీ వీడియోలు మీరే చూడండి.
Cat discovers she has ears.. #Caturday pic.twitter.com/R2OkF4Sns2
— Buitengebieden (@buitengebieden_) April 17, 2021
The cats face is everything pic.twitter.com/pO5ur4UlCK
— Janey Godley (@JaneyGodley) April 18, 2021
10 reasons why cats are pretty much just tiny humans ? pic.twitter.com/nalAA65j29
— The Dodo (@dodo) April 17, 2021
ఇది కూడా చదవండి: Papaya Benefits: ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే... బొప్పాయిని తినకుండా ఉండరు
జపాన్ ప్రజలకు పిల్లులు దేవుళ్లతో సమానం. అక్కడ పిల్లే స్టేషన్ మాస్టర్‌గా ఓ రైల్వే స్టేషన్ ఉంది. అలాగే... ఓ మెట్రోరైల్లో ఓ కోచ్ మొత్తం పిల్లి బొమ్మలతో సెట్ చేశారు. అలాగే... పిల్లుల కోసం ఓ దీవి కూడా జపాన్‌లో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: VIRAL NEWS, Viral Videos