సముద్రంలో పడిన సెల్‌ఫోన్... తెచ్చి ఇచ్చిన తిమింగలం... వైరల్ వీడియో...

Viral Video : ఆ తిమింగలం చేసిన మంచి పనికి అందరూ దాన్ని మెచ్చుకుంటున్నారు. స్వార్థంతో కూడిన మనుషుల కంటే తిమింగలాలే మంచివని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 10, 2019, 9:58 AM IST
సముద్రంలో పడిన సెల్‌ఫోన్... తెచ్చి ఇచ్చిన తిమింగలం... వైరల్ వీడియో...
బెలుగా తిమింగలం (Image : Instagram)
Krishna Kumar N | news18-telugu
Updated: May 10, 2019, 9:58 AM IST
అది నార్వేలోని హ్యామర్ ఫెస్ట్ హార్బర్. అక్కడ ఇసా ఒస్డాల్... తన ఫ్రెండ్స్‌తో కలిసి హార్బర్‌లో తిరుగుతోంది. చుట్టూ సముద్ర నీరు మధ్యలో వాళ్లు. ఇంతలో ఇసా చేతిలోని స్మార్ట్ మొబైల్... జారి పడింది. వెంటనే అది సముద్ర నీటిలోకి వెళ్లిపోయింది. అంతే ఆ క్షణం ఆమె శిలలా అయిపోయింది. ఏ నేల మీదో మొబైల్ పడితే తిరిగి తీసుకోవచ్చు. ఇక్కడ పడింది సముద్రంలో కదా. దిక్కు తోచలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నీటిలోకి చూస్తూ దిగాలుగా ఉండిపోయింది. ఇంతలో... ఏదో తెల్లటి ఆకారం నీటి లోంచీ పైకి వస్తున్నట్లు కనిపించింది. అదేంటా అని చూడసాగింది ఇసా. కొన్ని క్షణాలకు అది తిమింగలం అని అర్థమైంది. ఆ వెంటనే దాని నోట్లో సెల్‌ఫోన్ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది ఇసా. ఆమెతో పాటూ ఆమె ఫ్రెండ్స్ కూడా వాట్ వాటే వేల్ అంటూ ఆ మూగ జీవిని మెచ్చుకున్నారు. వేల్ నోటి నుంచీ సెల్‌ఫోన్ తిరిగి తీసుకొని... సంతోషంలో మునిగిపోయారు. 
Loading...

View this post on Instagram
 

when animals are kinder than humans 💖🐳 #beluga #whale This video is being represented by LADbible Group. To use or license this video please email licensing@ladbiblegroup.com


A post shared by ISA OPDAHL LARSSON | 21 (@isa.opdahl) on

చూడటానికి డాల్ఫిన్‌లా కనిపించే ఈ వేల్... బెలుగా జాతికి చెందినది. ప్రస్తుతానికి ఇవి ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. రష్యన్లు వీటికి మిలిటరీ ట్రైనింగ్ ఇస్తూ... శత్రువులపై దాడికి పంపిస్తున్నారనే ఆరోపణలు ఇటీవల వచ్చాయి. రష్యా ఆ ఆరోపణలను ఖండించింది.

 

ఇవి కూడా చదవండి :

దొనకొండపై వైసీపీ నేతల దృష్టి... జోరుగా భూముల కొనుగోళ్లు...

ఐపీఎల్ బెట్టింగ్ వివాదం... భార్యను చంపిన భర్త... యాసిడ్ తాగించి...

ప్రధాని అభ్యర్థిగా శరద్ పవార్... తెరపైకి కొత్త సమీకరణలు...

23న ఎన్నికల ఫలితాలు మరింత ఆలస్యం... లెక్క త్వరగా తేలదంటున్న అధికారులు...
First published: May 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...