Video : వామ్మో పొట్టేలు... అక్కడ గుద్దింది... బీబీసీ కెమెరామేన్‌కి షాక్...

Viral Video : పొట్టేలు కొమ్ములు చాలా బలంగా ఉంటాయి. ఒక్కసారి అది గుద్దాలని డిసైడైతే... చాలా బలంగా ఢీకొట్టింది. ఈ విషయం తెలియని బీబీసీ కెమెరామేన్... పొట్టేలును షూట్ చేద్దామనుకొని... అడ్డంగా బుక్కయ్యాడు. నెటిజన్లు అతనిపై జాలి చూపిస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 6, 2019, 11:20 AM IST
Video : వామ్మో పొట్టేలు... అక్కడ గుద్దింది... బీబీసీ కెమెరామేన్‌కి షాక్...
దాడి చేసిన గొర్రె (Image : YT - Cameraman smacked in the nuts by angry sheep 😱 - BBC)
Krishna Kumar N | news18-telugu
Updated: September 6, 2019, 11:20 AM IST
మన శరీరంలో కొన్ని భాగాలు అత్యంత సున్నితంగా ఉంటాయి. వాటికి దెబ్బ తగిలితే తట్టుకోలేం. ఆ పరిస్థితి బీబీసీ కెమెరామేన్‌కి ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోని బీబీసీ... యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో కామెరూన్ గొర్రె - సెసిల్‌కు సంబంధించి... జూకీపర్‌తో బీబీసీ ప్రజెంటర్ కేట్ హంబుల్ మాట్లాడుతున్న దృశ్యాలున్నాయి. వాళ్ల దగ్గరకు వచ్చిన పొట్టేలు... వాళ్లు తినిపించే గింజలు తినేసింది. ఆ తర్వాత పక్కనే ఉన్న బీబీసీ కెమెరామేన్ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో అతను కూర్చొని ఉన్నాడు. గొర్రెను క్లోజ్ షాట్ తీద్దామనుకున్నాడు. అంతలో అదే అతనికి షాట్ ఇచ్చింది. కరెక్టుగా సెన్సిటివ్ పార్ట్స్‌ను ఢీకొట్టడంతో... కెమెరామేన్... ఒక్కసారిగా షాకై.... కిందపడ్డాడు.


విల్ట్స్... లాంగ్లెస్ ఎస్టేట్ అండ్ సఫారీ పార్క్‌లో పరిశోధనలు చేస్తున్న సమయంలో... ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 2న అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 8 లక్షల మందికి పైగా చూశారు. చాలా మంది కెమెరామేన్‌పై జాలి చూపిస్తున్నారు. ఇదో దురదృష్టకర సంఘటనగా వారు అభిప్రాయపడ్డారు.

నెటిజన్ల స్పందన (Image : YT - Cameraman smacked in the nuts by angry sheep 😱 - BBC)


First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...