• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • VIRAL VIDEO A GROUP OF MEN TRIES TO GRILL KEBAB USING LAMBORGHINIS EXHAUST THEN THIS IS WHAT HAPPENED WATCH VIDEO NK

Viral video: కారు పొగ గొట్టం దగ్గర చికెన్ కబాబ్ వండాడు... ఆ తర్వాత ఇలా అయ్యింది

Viral video: కారు పొగ గొట్టం దగ్గర చికెన్ కబాబ్ వండాడు... ఆ తర్వాత ఇలా అయ్యింది

Viral video: కారు పొగ గొట్టం దగ్గర చికెన్ కబాబ్ వండాడు... ఆ తర్వాత ఇలా అయ్యింది (image credit - Youtube)

Viral video: అది లంబోర్గినీ కారు. అత్యంత ఖరీదైనది. దాని పొగ గొట్టం దగ్గర చికెన్ కబాబ్ వండాలని అతను ఎందుకు అనుకున్నాడు. చివరకు ఏమైందో వీడియో ద్వారా తెలుసుకుందాం.

  • Share this:
    Viral video: తక్కువలో తక్కువ రూ.3 కోట్లు ఉంటుంది లంబోర్గినీ కారు. అలాంటి కారును విపరీతంగా రైజ్ చేయడం ద్వారా... వచ్చే మంటతో... చికెన్ కబాబ్ గ్రిల్ చెయ్యాలనుకున్నాడు. కారు ఎగ్జాస్ట్ నుంచి వచ్చే మంటతో గ్రిల్ చేద్దామని ట్రైచేశాడు. కానీ కొన్ని ప్రయత్నాల తర్వాత ఏకంగా కారు పాడై... దాని నుంచి పెద్దగా పొగ వచ్చేసింది. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో... ఓ కారు గ్యారెజీలో ఈ ఘటన జరిగింది. కొంత మంది ఫ్రెండ్స్ కలిసి... ఇలా కబాబ్ వండితే ఎలా ఉంటుందో చూద్దామని అనుకున్నారు. ప్రయత్నం బెడిసికొట్టింది. కబాబ్ సంగతేమోగానీ... కారు పాడైపోయింది. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

    ఈ వీడియోలో ఆ తుంటరి కుర్రాడు... నేలపై వాలి... లంబోర్గినీ కారు ఎగ్జాస్ట్ దగ్గర రెడీగా ఉన్నాడు. తన చేత్తో స్క్యూవర్ పట్టుకొని...... మాంసం ముక్కను... కారు ఎగ్జాస్ట్ దగ్గర ఉంచాడు. మరో కుర్రాడు... కారు ఎక్కి... దాని V12 ఇంజిన్‌ను రైజ్ చేశాడు. అంతలా రైజ్ చెయ్యడంతో... ఏకంగా ఎగ్జాస్ట్ నుంచి మంటలే బయటకు వచ్చాయి. ఆ మంటల్లో కబాబ్‌ను గ్రిల్ చెయ్యాలని చూశాడు. కొన్ని సెకండ్లకే... కారులోంచీ పొగలు వచ్చేయడంతో... అంతా షాక్ అయ్యారు. వామ్మో.. అనుకున్నారు. ఈ ఘటన తర్వాత ఎరుపు రంగులో కూలాంట్ లిగ్విడ్... కారు నుంచి లీకైంది. ఫ్లోర్‌పై అది ప్రవహించింది. ఆ వీడియో మీరే చూడండి.

    కారు నుంచి పొగలు రావడంతో... వాళ్లంతా కంగారు పడ్డారు. వాళ్లలో ఎవరికీ ఆ పొగను ఆపడం రాలేదు. ఇంతకీ... రక్తం రంగులో... ఆ లిక్విడ్ ఎందుకు వచ్చిందనే డౌట్ మీకు ఉండి ఉంటుంది. వీళ్లు రైజ్ చేసినప్పుడు హీట్, మంట వచ్చాయి కదా... కారులో ప్లాస్టిక్ కూలాంట్ ట్యాంక్ ఉంటుంది. ఈ మంటలు ఆ ట్యాంకుకు తగిలాయి. దాంతో... అది కూల్ పోయి... హీట్ అయ్యింది. కన్నం పడి... అందులో లిక్విడ్ కిందపడింది.

    ఇది కూడా చదవండి: Viral videos: పానీపూరీ ఇష్టంగా తింటున్న ఆవులు... వీడియోకి అదిరిపోయే రెస్పాన్స్

    ఈ వీడియో నెటిజన్లకు నచ్చట్లేదు. వీడియో ఎలా ఉన్నా వాళ్లు చేసింది మాత్రం పనికిమాలిన పని అంటున్నారు. కోట్ల విలువైన కారును ఇలా నాశనం చేయడమేంటని ఫైర్ అవుతున్నారు. వంట చేసుకోవాలంటే స్టవ్ కొనుక్కోవాలి గానీ... ఇలా ఎవరైనా చేస్తారా... వాళ్లకు మైండ్ ఉందా... అని ఓ యూజర్ ఫైర్ అయ్యారు. కారుకు ఏం చేస్తున్నారో తెలియనప్పుడు... చెయ్యడమెందుకు అని మరో యూజర్ తిట్టిపోశారు. న్యూట్రల్‌లో పెట్టి కారును రిపీట్‌గా రెవ్ చేయకూడదు... ఆ కారు ఆ విధంగా తయారుచేసినది కాదు అని మరో యూజర్ తెలిపారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు