హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Viral News: అతడు మూడు గంటలు..1600 కి.మీ విమానం టైర్ల పక్కన కూర్చొని ప్రయాణించాడు.. వీడియో వైరల్..

Viral News: అతడు మూడు గంటలు..1600 కి.మీ విమానం టైర్ల పక్కన కూర్చొని ప్రయాణించాడు.. వీడియో వైరల్..

విమానం నుంచి కిందకు దిగిన వ్యక్తి

విమానం నుంచి కిందకు దిగిన వ్యక్తి

Viral News: విమానం ల్యాండింగ్‌ గేర్‌లో దాక్కున్న ఒక వ్యక్తి.. మూడు గంటల ప్రయాణం తర్వాత మరో ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యాడు. దాదాపు అతడు 1600 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ విమానం గ్వాటెమాలా నుంచి బయలుదేరి మియామి విమానాశ్రయంలో దిగింది. విమానంలో నుంచి కిందకు దిగేందుకు ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి సిబ్బంది అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. విమానం లోపల నుంచి వచ్చే ప్రయాణికుల కంటే ముందే.. ఓ వ్యక్తి విమానం నుంచి బయటకు వచ్చాడు. అతడిని చూసిన సిబ్బంది ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. ఎందుకంటే.. అతడు విమానం లోపల నుంచి డోర్ ద్వారా కాకుండా ఫ్లైట్‌ కింద ఉండే ల్యాండింగ్​ గేర్​ నుంచి బయటకు దిగాడు. ఇలా అతడు దాదాపు 1600 కిలోమీటర్లకు పైగా టైర్ల పక్కనే ఉండే ల్యాండింగ్ గేర్ లోనే ఉన్నాడు. కిందకు దిగాక ఆ వ్యక్తికి సంబంధించిన దృశ్యాలను స్థానిక సిబ్బంది వీడియో తీశారు.

Marriage Couples: ఈ నాలుగు కారణాల వల్లనే.. భార్యాభర్తల మధ్య బంధం బలహీనపడుతుంది.. అవేంటంటే..


సదరు వీడియోను స్థానిక వార్తాసంస్థ తన ఇన్‌స్టాగ్రామ్​ ఖాతాలో పోస్ట్​ చేసింది. అయితే ఈ ఘటలనలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ముందుకు అతడిని అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం గ్వాటెమాలా సిటీ నుంచి మియామి నగరానికి బయలు దేరింది. వీటి మధ్య దూరం దాదాపు 1600 కిలోమీటర్లు. అమెరికన్​ ఎయిర్​లైన్స్​ విమానంలో వెళ్లాలంటే రెండున్నర గంటల సమయం పడుతుంది. అయితే ఆ ప్రయాణం మొత్తం ఆ వ్యక్తి విమానం టైర్ల పక్కనే ఉండే ల్యాండింగ్‌ గేర్‌లోనే ఉన్నాడు. ల్యాండింగ్‌ గేర్‌లో సదరు వ్యక్తి దాక్కున్నాడు. విమానం గాటిమాలా నుంచి మియామి ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. అక్కడ విమానం ల్యాండైన అనంతరం అతన్ని ఎయిర్‌పోర్టు అధికారులు పట్టుకొని ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. మూడు గంటలపాటు విమానం ల్యాండింగ్‌ గేర్‌లో దాక్కుని ప్రయాణించినా.. ఈ వ్యక్తికి ఎటువంటి గాయాలూ కాలేదని తెలుస్తోంది.

Doctor And Patients: ఒక డాక్టరై ఉండి రోగులతో ఇదేం పాడు పని.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 15 మందితో..


ఈ వ్యవహారంపై వీడియో తీసిన విమానాశ్రయ సిబ్బంది స్పందించేందుకు నిరాకరించారు. గ్యాటెమాలా దేశం అమెరికాకు దక్షిణాన ఉంటుంది. గత కొంతకాలంగా ఇక్కడి నుంచి అమెరికాలోకి అక్రమంగా వలస వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. గత సంవత్సరంలో US సరిహద్దు ఏజెంట్లు బహిష్కరించిన దాదాపు 1.7 మిలియన్ల మంది వలసదారులలో ఎక్కువ భాగం గ్వాటెమాలలో నివాసముంటున్నారు. వారిలో చాలామంది సెంట్రల్ అమెరికన్లు హింసాత్మక ముఠాల నుండి పారిపోయి పేదరికం నుండి తప్పించుకుంటున్నారు.

Walking: ఆమె స్నేహితులతో సరదాగా వాకింగ్ కు వెళ్లింది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..


ఈ క్రమంలో అధికారుల కళ్లుగప్పి తప్పించుకునేందుక యత్నించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ 2014లో అలాంటి ఒక సంఘటనలో, ఇంటి నుండి పారిపోయిన 16 ఏళ్ల బాలుడు కాలిఫోర్నియా నుండి హవాయికి వెళ్లేటప్పుడు జెట్‌లైనర్‌లోని చక్రాల కింద ఐదు గంటలపాటు ప్రయాణించి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుత ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిలో సదరు వ్యక్తితో.. ఇమిగ్రేషన్ అధికారులు మాట్లాడుతూ కనిపిస్తున్నారు.

First published:

Tags: America, Flight

ఉత్తమ కథలు