ఆఫీస్‌లో మొసలి... రిసెప్షనిస్ట్ జాబ్... చక్కగా సూట్ వేసుకొని...

Viral Photo : ఆఫీస్‌లో మొసలి ఉన్న ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది ఇది ఎక్కడ? నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 30, 2019, 9:10 AM IST
ఆఫీస్‌లో మొసలి... రిసెప్షనిస్ట్ జాబ్... చక్కగా సూట్ వేసుకొని...
Viral Photo : ఆఫీస్‌లో మొసలి ఉన్న ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది ఇది ఎక్కడ? నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు.
  • Share this:
ఆ ఆఫీస్‌లో అడుగుపెట్టిన వాళ్లు షాకవుతున్నారు. దిమ్మలా ఉన్న మొసలి... రిసెప్షనిస్ట్ కూర్చునే సీటులో కూర్చొని కనిపిస్తోంది. మొదట అది బొమ్మ మొసలి అనుకుంటున్నవాళ్లు... తీరా అది కాస్త కదలగానే... అమ్మో నిజమైన మొసలే అని తుళ్లిపడుతున్నారు. ఆ క్రొకొడైల్‌ సూట్ వేసుకొని ఉండటం మరో విచిత్రం. చుట్టూ మిగతా వర్కర్లు తమ పనుల్లో తాము నిమగ్నమై ఉంటున్నారు. మొసలి బిజీగా ఉంటూ... తన కంప్యూటర్‌లో ఏదో చూసుకుంటూ ఉంటోంది. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది ఇది ఎక్కడ? నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు. సూట్ వేసుకున్న మొసలి ఎలాంటి ప్యాంట్స్ వేసుకుంది? దానికి సరిపడే ప్యాంట్స్ బయట ఉండవుగా. తోక కోసం ఎలాంటి డ్రెస్ కుట్టారు? ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు.వర్గ్‌స్క్లెతర్ అనే ట్విట్టర్ యూజర్... ఈ ఫొటోను షేర్ చేశారు.

ఆ ఫన్నీ ఫొటో చూసి... చాలా మంది ఫన్నీ కామెంట్లు పెట్టారు. మొసలి బాగా పనిచేస్తోందని ఒకరు... చాలా అందంగా ఉందని ఇంకొకరు... ఫ్లోరిడాలో ఇలాంటివి కామనే అని మరొకరు స్పందించారు.

First published: September 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading