Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: August 8, 2019, 12:57 PM IST
యారో స్పిన్ ట్రిక్ (Image : Twitter - Khai)
సోషల్ మీడియాలో ఇప్పుడో త్రీడీ స్పిన్ వీడియో సెన్సేషన్ సృష్టిస్తోంది. జపాన్ గణితవేత్త (మేథమేటీషియన్), శిల్పకారుడైన కొకిచి సుగిహరా... ఓ చిన్న త్రీడీ యారోను తయారుచేశారు. దాన్ని వీడియో తీసిన సింగపూర్ ఆర్ట్ డైరెక్టర్ థామ్ ఖాయ్ మెంగ్... ట్విట్టర్లో షేర్ చేశారు. ఆప్టికల్ ఇల్యూషన్ విధానంతో తయారుచేసిన ఆ యారో... ఎటు తిప్పినా ఒకేలా కనిపిస్తుండటాన్ని చూసిన నెటిజన్లు... తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదంటూ ఆయన... అది అలా ఎందుకు కనిపిస్తోందో అదే వీడియోలో వివరించారు. త్రీడీ ప్రింటింగ్‌తో తయారైన ఆ యారోలో... చాలా మలుపులు (కర్వ్స్) ఉన్నాయి. వాటన్నింటినీ మన బ్రెయిన్ అర్థం చేసుకోలేదనీ... ఆ టెక్నిక్ ద్వారా ఈ యారో తయారవ్వడం వల్లే... దాన్ని చూడగానే అందరం కన్ఫ్యూజ్ అవుతున్నామని వివరించారు.
ఆశ్చర్యంగా ఉండటంతో... ఈ వీడియో వైరల్ అవ్వడానికి ఎక్కువ టైమ్ పట్టలేదు. ఇదెలా సాధ్యమన్నదానిపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవేంటో మీరే తెలుసుకోండి.
Published by:
Krishna Kumar N
First published:
August 8, 2019, 12:57 PM IST