ఆ కంపెనీ విమానాల్లో ఎయిర్ హోస్టెస్‌‌లు బికినీలు వేసుకుంటారట...

విమాన ప్రయాణం జరుగుతున్నంత సేపు బోర్ కొట్టకుండా ప్రయాణంలో కాస్త గ్లామర్ పెంచేందుకు, ఎయిర్ హోస్టెస్‌లకు బికినీలు వేయిస్తున్నారు. దీంతో ఈ ఎయిర్ లైన్‌కు ఏకంగా బికినీ ఎయిర్ లైన్ అనే పేరు వచ్చేసింది. అటు టూరిస్టులు వియత్ జెట్ టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు.

news18-telugu
Updated: May 10, 2019, 10:55 PM IST
ఆ కంపెనీ విమానాల్లో ఎయిర్ హోస్టెస్‌‌లు బికినీలు వేసుకుంటారట...
(ఫైల్ చిత్రం)
  • Share this:
ఎయిర్ లైన్స్ వారు తమ తమ వ్యాపారాలను నుంచి కష్టాల గట్టెక్కించుకునేందుకు, కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వియత్నాంకు చెందిన వియత్ జెట్ ఎయిర్ సర్వీసుల వారు కస్టమర్లను ఆకర్షించేందుకు ఒక కొత్త ఉపాయం కనిపెట్టారు. విమాన ప్రయాణం జరుగుతున్నంత సేపు బోర్ కొట్టకుండా ప్రయాణంలో కాస్త గ్లామర్ పెంచేందుకు, ఎయిర్ హోస్టెస్‌లకు బికినీలు వేయిస్తున్నారు. దీంతో ఈ ఎయిర్ లైన్‌కు ఏకంగా బికినీ ఎయిర్ లైన్ అనే పేరు వచ్చేసింది. అటు టూరిస్టులు వియత్ జెట్ టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా, వియత్ జెట్ మాత్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు లాభాలు లేక విమానయాన రంగంలో ఒక్కో కంపెనీ మూసివేస్తున్న తరుణంలో, ఎయిర్ లైన్స్‌ను బతికించేందుకు ఇలాంటి ప్రయోగాలు తప్పవని వియత్ జెట్ పేర్కొంటోంది.

ప్రస్తుతం వియత్ జెట్ మొత్తం 23 డొమెస్టిక్, 10 అంతర్జాతీయ రూట్లలో సేవలు అందిస్తోంది. బికినీ ఎయిర్ హోస్టెస్ దెబ్బకు అన్ని రూట్లు ఫుల్ అయిపోతున్నాయి. పాసింజర్లు సైతం వెరైటీగా ఉండటం కోసం ఈ ఎయిర్ లైన్స్ ను ఎంపిక చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కంపెనీ వ్యవస్థపకురాలు ఒక మహిళకావడం విశేషం. విమాన సర్వీసులు స్థాపించిన తర్వాత వియత్ జెట్ సీఈవో ఆదేశపు తొలి మహిళా బిలియనీర్ గా అవతరించడం విశేషం.
First published: May 10, 2019, 10:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading