Video : చూస్తుండగానే సునామీ వచ్చేస్తే... ప్రాణభయంతో పరుగులు పెట్టిన టూరిస్టులు...

Iceland Glacier : ఐస్‌ల్యాండ్‌లో జరిగిన అనూహ్య పరిణామం పర్యాటకులను పరుగులు పెట్టించింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

news18-telugu
Updated: April 3, 2019, 8:43 AM IST
Video : చూస్తుండగానే సునామీ వచ్చేస్తే... ప్రాణభయంతో పరుగులు పెట్టిన టూరిస్టులు...
ఐస్ ల్యాండ్‌లో ఓ దృశ్యం. (Image : Twitter)
news18-telugu
Updated: April 3, 2019, 8:43 AM IST
అది ఐస్‌ల్యాండ్‌ లోని వట్నాజోకుల్ నేషనల్ పార్కులోను బ్రెయోమెర్కురోజకుల్ గ్లేసియర్. అక్కడి మంచు కొండల్ని, వాటి శ్వేత వర్ణ శోభిత అందాల్ని చూసి పరవసిస్తూ ఉన్నారు పర్యాటకులు. ఇంతలో ఆ మంచుకొండలో కొంతభాగం విరిగి సముద్రంలో పడింది. అది కొంత దూరంగానే ఉండటంతో... పర్యాటకులు లైట్ తీసుకున్నారు. మంచు సముద్రంలో పడిన కొన్ని క్షణాలకు ఓ రాకాసి అల సునామీలా దూసుకొచ్చింది. అంతే... పర్యాటకులు షాకయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దూరంగా పరుగులుపెట్టారు. వాళ్లు ఏమాత్రం ఆలస్యం చేసినా... ఆ సునామీ అల వాళ్లను మింగేసేదే. ఇదంతా చూసిన మౌంటేన్ గైడ్ స్టెఫాన్ మాంట్లెర్ వీడియో తీశాడు. 42 సెకండ్ల ఆ వీడియోని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.


సాధారణంగా ట్రైనింగ్ తీసుకున్న మౌంటేనీర్లతో వచ్చిన పర్యాటకుల్ని మాత్రమే ఆ ప్రదేశానికి అనుమతిస్తారు. అక్కడ తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు కూడా కొంతమంది గైడ్లు అక్కడున్నారు. ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే కాపాడేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నా... అందరూ క్షేమంగా బయటపడటంతో... ఏ సమస్యా రాలేదు.

ప్రపంచవ్యాప్తంగా వేడి పెరుగుతోంది. ఫలితంగా మంచుకొండలు కరిగిపోతున్నాయి. అది వాతావరణానికి ప్రమాదమని తెలిసినా పరిస్థితిని ప్రపంచ దేశాలు సరిచెయ్యలేకపోతున్నాయి.



 

ఇవి కూడా చదవండి :

రాకెట్ నుంచీ శాటిలైట్లు అంతరిక్షంలోకి వెళ్లడం ఎప్పుడైనా చూశారా... ఈ వీడియోలో చూడండి...

ఒక్కో జన్ ధన్ ఖాతాలో రూ.10,000... ఎలా వచ్చాయి... ఎవరు వేశారు? దర్యాప్తు చేస్తున్న ఈసీ

టాలీవుడ్‌ నటులను కేసీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా... చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజమెంత?

నారా లోకేష్ నకిలీ... జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ఫ్యూచర్... రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్
First published: April 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...