హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

America: అమ్మా.. అమ్మా ప్లీజ్‌ అమ్మా! అయినా వదలని దుర్మార్గ ఖాకీలు

America: అమ్మా.. అమ్మా ప్లీజ్‌ అమ్మా! అయినా వదలని దుర్మార్గ ఖాకీలు

PHOTO SOURCE : AP

PHOTO SOURCE : AP

America Brutal murder: అమ్మా.. అమ్మా అంటూ ఎంత బతిమిలాడిన వదల్లేదు..! తానే తప్పు చేయలేదని ఏడుస్తున్నా కనికరించలేదు. అమెరికాలో ఖాకీల కర్కశత్వానికి మరో నల్లజాతీయుడు బలైపోయాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అమెరికా శ్వేత జాతీయ ఖాకీల దూరహంకారానికి మరో నల్లజాతీయుడు బలైపోయాడు. అమెరికాలో నల్లజాతీయులపై ఆగడాలను తప్పుబడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని విమర్శలొస్తున్నా జాత్యహంకార పోలీసుల కర్కశత్వం మాత్రం ఆగడంలేదు. అప్పుడెప్పుడో జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యతోనే ప్రపంచం ముందు అమెరికా తలదించుకోవాల్సి వచ్చింది. అయినా తీరు మార్చుకుందా అంటే.. అదీ లేదు..! జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య తర్వాత నల్లజాతీయులపై దాడులు పెరిగాయే కానీ తగ్గలేదు. తాజాగా అదే తరహాలో జరిగిన టైర్ నికోలస్ అనే నల్ల జాతీయుడి హత్య చూస్తే ఇక అమెరికా మారుతుందన్న నమ్మకం కూడా లేదు.

జార్జ్‌ ఫ్లాయిడ్‌ తరహా హత్య:

అమెరికా మెంఫిస్‌లో ర్యాష్‌ డ్రైవింగ్ చేశాడని ఆరోపిస్తూ టైర్‌ నికోలస్‌ అనే నల్ల జాతీయుడిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ అతడు తనను ఎందుకు అదుపులోకి తీసుకోవాలనుకుంటారని ప్రశ్నించాడు..తాను అసలు ర్యాష్‌ డ్రైవింగే చేయలేదని చెప్పాడు. అయితే పోలీసులు మాత్రం నికోలస్ మాటలను పట్టించుకోకుండా చితకబాదారు. అమ్మా అమ్మా అని అరుస్తున్నా పట్టించుకోకుండా  చావ బాదారు. పోలీస్‌ దెబ్బలకు నికోలస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. నికోలస్‌ మరణంతో అమెరికాలో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. నికోలస్‌పై పోలీసులు దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

పోలీసుల దారుణ ప్రవర్తన:

పోలీసులు నికోలస్‌ను కొడుతున్న వీడియోలో వాళ్ల మధ్య జరిగిన సంభాషణ క్లియర్‌గా వినిపిస్తోంది. తానేం తప్పు చేయలేదని.. ఇంటికి వెళ్తున్నానని నికోలస్‌ చెబుతుండగా.. పోలీసులు రోడ్డుపై పడేశారు. పెప్పర్​ స్ప్రే కూడా ఉపయోగించారు. పోలీసులు కొడుతున్నప్పుడు నికోలస్‌ 'అమ్మా.. అమ్మా' అని అరుస్తున్న దశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. దెబ్బల బాధతో గుండెలు పగిలేలా రోధిస్తున్న నికోలస్‌ ఏడుపు చూసి కూడా పోలీసులు కొట్టడం ఆపలేదు. అటు ఈ ఘటనపై టెన్నెస్సి బ్యూరో ఆఫ్​ ఇన్​వెస్టిగేషన్ దర్యాప్తు మొదలుపెట్టింది. నికోలస్ మరణంపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్​ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసుల అనుచిత ప్రవర్తనపై మండిపడ్డారు. పోలీసులు నికోలస్‌పై దాడి చేస్తున్న దృశ్యాలు తాను చూశానని, అవి తనను ఎంతగానో బాధించాయన్నారు బైడెన్‌.

First published:

Tags: America, Police