వివాదం...మలేషియా అక్వేరియంలో తిమింగలం!

తిమింగలాన్ని తక్షణం సముద్రంలో విడిచిపెట్టాలని నెటిజన్లు, జంతు ప్రియులు డిమాండ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: July 3, 2018, 12:29 AM IST
వివాదం...మలేషియా అక్వేరియంలో తిమింగలం!
మలేషియా రెస్టారెంట్‌లోని అక్వేరియంలో బంధీగా తిమింగలం
  • Share this:
సముద్రంలో స్వేచ్ఛగా తిరగాల్సిన తిమింగలాన్ని మలేషియాలోని ఓ రెస్టారెంట్‌ అక్వేరియంలో బంధీగా ఉంచడంపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. తిమింగలం చిన్నపాటి అక్వేరియంలో చక్కర్లు కొడుతున్న 10 సెకన్ల నిడివి కలిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తక్షణం తిమింగలాన్ని సముద్రంలో విడిచిపెట్టాలని సోషల్ మీడియా వేదికగా పలువురు జంతు ప్రియులు, నెటిజన్లు డిమాండ్ చేశారు. తిమింగలాన్ని అక్వేరియంలో బంధీగా ఉంచిన రెస్టారెంట్ యజమానులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వంపై వారిపై చర్యలు తీసుకోవాలని, తిమింగలాన్ని స్వాధీనం చేసుకుని సముద్రంలో విడిచిపెట్టాలని కోరుతున్నారు.

కౌలాలంపూర్‌ శివారులోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఒక వ్యక్తి, చేపలు ఉంచే చిన్నపాటి అక్వేరియంలో తిమింగలాన్ని ఉంచడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కేవలం 6 అడుగుల పొడగు, మూడు అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తున్న అక్వేరియంలో తిమింగలాన్ని బంధించినట్లు తెలిపాడు. దీని బరువు సుమారు 100 కేజీలు ఉండొచ్చని భావిస్తున్నారు.అక్వేరియంలో తిమింగలాన్ని బంధించడాన్ని ఖండిస్తూ పలువురు కామెంట్స్ చేశారు. పాపం ఆ ప్రాణిని విడిచిపెట్టండంటూ ఓ వ్యక్తి రెస్టారెంట్ యజమానులను వేడుకున్నాడు. మానవత్వమున్న ఎవరైనా ఇలాంటి ప్రదేశంలోకి వెళ్లి ఎలా తినగలరు? తాగగలరు? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు.
Published by: Janardhan V
First published: July 3, 2018, 12:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading