Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Robot Pulling A Rickshaw: రిక్షా లాగుతున్న రోబో. వాడకం అంటే ఇదీ. వైరల్ వీడియో

    Robot Pulling A Rickshaw: లక్షలు, కోట్లు విలువ చేసే రోబోలను తయారుచేసేది మనకు సేవలు చేసేందుకే. ఇందులో భాగంగానే... రిక్షా లాగే రోబోను తయారుచేశారు.

    news18-telugu
    Updated: October 27, 2020, 12:04 PM IST
    Robot Pulling A Rickshaw: రిక్షా లాగుతున్న రోబో. వాడకం అంటే ఇదీ. వైరల్ వీడియో
    రిక్షా లాగుతున్న రోబో (credit - twitter)
    • Share this:
    Robot Pulling A Rickshaw: మనకు రకరకాల పనులు చేసి పెట్టే రోబోలను మనం చూసి ఉంటాం కానీ... రిక్షా లాగే రోబోను ఎప్పుడూ చూసి ఉండం. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి పనులు రోబోలు చెయ్యలేదు. ఇటీవల ప్రత్యేకంగా రిక్షాను లాగే రోబోను తయారుచేశారు. అది ఎలా పనిచేస్తుందో ప్రయోగాత్మకంగా చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమెరికా స్పెషల్ ఎఫెక్ట్స్ డిజైనర్ అండ్ టెలివిజన్ పర్శనాల్టీ అయిన ఆడమ్ సావేజ్... ఈ రోబో డాగ్‌తో రిక్షాను లాగేలా చేశారు. నిజానికి ఈ వీడియో ఇప్పటిది కాదు... ఫిబ్రవరి నాటిది. కానీ ఇప్పటివరకూ ఇది వైరల్ కాలేదు. తాజాగా... IAS ఆఫీసర్ సుప్రియా సాహూ దీన్ని షేర్ చేయడంతో... వైరల్ అయ్యింది.

    రోబో రిక్షాను లాగే ముందు... సావేజ్ రిక్షా ఎక్కారు. ఆయన బరువును కూడా ఆ రోబో మోయగలిగింది. రోబోకి స్పాట్ అని పేరు పెట్టిన ఆయన... మనిషితో ఎలా మాట్లాడతారో... అట్లాగే దానితోనూ మాట్లాడుతున్నారు. కదిలే ఆ కుక్క రోబో... ఆయన మాటల్ని అర్థం చేసుకోగలుగుతోంది. రిక్షా ఎక్కాక... "ఇంకెందుకాలస్యం... మార్కెట్‌కి పద" అనగానే... రోబో రిక్షా లాగుతూ... రోడ్డుపై బయల్దేరింది. ఈ రోబోను బోస్టన్ డైనమిక్స్ కంపెనీ తయారుచేసింది. ఈ రోబోకి కొంతవరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. అందువల్ల ఇది పరిస్థితులను బట్టీ నడుచుకుంటుంది. అంటే... రోడ్డుపై ఎత్తుపల్లాలు వస్తే... అందుకు తగ్గట్టుగా నడపగలదు. అలాగే... కొండలు ఎక్కడం, దిగడం అన్నీ చెయ్యగలదు.




    ఈ వీడియోకి ఇప్పటికే 66వేల వ్యూస్ వచ్చాయి. చాలా మంది ఇది అదిరిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. అద్భుతంగా ఉందంటున్నారు. ఓ యూజరైతే... "నా బదులు ఆఫీసుకి వెళ్లే రోబోను ఎవరైనా తయారుచేస్తే బాగుండని ఎదురుచూస్తున్నా" అని కామెంట్ పెట్టారు.

    సేవేజ్ వాడినది ఆయనే స్వయంగా తయారుచేయించిన రిక్షా. అందువల్లే అది చూడటానికి యాంటిక్ పీస్‌లా ఉంది. అది వెళ్తున్నప్పుడు దాని ఉన్న గంటలు మోగుతూ... ఆకర్షణీయంగా ఉన్నాయి. టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న ప్రపంచం... మరింత సౌకర్యవంతంగా జీవితాలను మార్చేందుకు సరికొత్త ఆవిష్కరణలు చేస్తోంది.
    Published by: Krishna Kumar N
    First published: October 27, 2020, 12:04 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading