Bottle Flip Challenge : హాంకాంగ్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్న వీడియో...

Hong Kong : చైనాకి వ్యతిరేకంగా హాంకాంగ్‌లో 14వ వారం ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఐతే... ఓ ముసలాయన చేసిన ప్రయత్నం... ఆందోళనకారులతోపాటూ... పోలీసుల్లోనూ ఉత్సాహం తెచ్చింది. యుద్ధ వాతావరణాన్ని కూల్‌గా మార్చేసింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 16, 2019, 10:48 AM IST
Bottle Flip Challenge : హాంకాంగ్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్న వీడియో...
హాంకాంగ్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్న వీడియో... (Source - Twitter - NowThis)
Krishna Kumar N | news18-telugu
Updated: September 16, 2019, 10:48 AM IST
Hong Kong protests : తమ పాలకులను తామే స్వయంగా ఎన్నుకుంటామనీ, తమకు స్వేచ్ఛ ఇవ్వాలనీ హాంకాంగ్ ప్రజలు ఆందోళనలు చేస్తున్న విషయం మనకు తెలుసు. ఇందుకు చైనా ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో... 14 వారాలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా... మాస్ ట్రాన్సిట్ రైల్వే స్టేషన్ దగ్గర ఓ వైపు ఆందోళనకారులు, మరోవైపు పోలీసులూ మోహరించారు. ఆందోళనకారుల్ని అక్కడి నుంచీ వెళ్లిపోమని పోలీసులు కోరుతుంటే... పోలీసులే అక్కడి నుంచీ వెళ్లిపోవాలని ఆందోళనకారులు పట్టుపట్టారు. ఆ సమయలో పోలీసులు వాళ్లను ఎలా చెదరగొట్టాలా అని ఆలోచిస్తుంటే... ఓ ముసలాయన... నేలపై కూర్చొని... ఓ బాటిల్‌ను ఎగరేస్తూ... తిరిగి అది దానంతట అదే నిల్చునేలా చేసేందుకు (Bottle Flip Challenge) ప్రయత్నించాడు. మూడో ప్రయత్నంలో ఆయన విజయం సాధించాడు. ఆయన బాటిల్ నిలబెట్టగలడా లేదా అని ఆందోళనకారులూ, పోలీసులూ అంతా అటే చూశారు. ఎప్పుడైతే ముసలాయన సక్సెస్ అయ్యాడో... అందరూ క్లాప్స్ కొట్టి... విజిల్స్ వేసి... పెద్దాయనను మెచ్చుకున్నారు. దాంతో యుద్ధ వాతావరణం కాస్తా కూల్‌ అయిపోయింది. ముసలాయన కోరడంతో... పోలీసులు అక్కడి నుంచీ వెళ్లిపోవడంతో... అందరూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాటిల్ ఫ్లిప్ ఛాలెంజ్ ఊపందుకుంది. చాలా మంది అలా బాటిల్ నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఆందోళనకారులు ఉన్న రైల్వే స్టేషన్‌ను రెండు వారాల కిందటే మూసివేశారు. అక్కడి టికెట్ వెండింగ్ యంత్రాన్ని, టికెట్ గ్యాంట్రీస్‌ని ఆందోళనకారులు నాశనం చేశారు. అప్పటి నుంచీ ఆ స్టేషన్ దగ్గర రైళ్లు ఆగట్లేదు.




తమపై చైనా ఆధిపత్యమేంటని నిలదీస్తున్న హాంకాంగ్ ప్రజలు... ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా ఆదివారం పోలీసులతో భారీ ఘర్షణలు తలెత్తాయి. వేల మంది వీధుల్లోకి వచ్చి... చైనాకు వ్యతిరేకంగా ఆదోళనలు చేశారు. ఎప్పట్లాగే చైనా పోలీసులు వాళ్లను చెదరగొట్టేందుకు భాష్పవాయుగోళాల్ని ప్రయోగించారు.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...