బైక్ తోలిన కుక్క... నిజమే... కావాలంటే మీరే చూడండి

Dog Riding Bike : కుక్క ఎక్కడైనా బైక్ తోలుతుందా అని అనుకోకండి. అది జరిగింది మరి. దానికి సంబంధించి వీడియో కూడా ఉంది.

news18-telugu
Updated: October 28, 2019, 8:46 AM IST
బైక్ తోలిన కుక్క... నిజమే... కావాలంటే మీరే చూడండి
బైక్ తోలిన కుక్క... నిజమే... కావాలంటే మీరే చూడండి (credit - twitter - Klara Sjöberg)
  • Share this:
Dog Riding Bike : ఈ వీడియో ఎవరు షూట్ చేశారో తెలియదు గానీ... కుక్క బైక్ డ్రైవ్ చేస్తుంటే... దాని వెనక ఇద్దరు కూర్చున్నారు. ఎలాంటి భయమూ లేకుండా... ఆ కుక్క... చక్కగా డ్రైవింగ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది దీన్ని చూసి నవ్వుతున్నారు. భలే భలే అంటున్నారు. ఇంకొంతమంది తేడా వస్తే పోతారు అని నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఐతే... ఇక్కడ మనం ఓ విషయం గమనించాలి. నిజానికి ఆ బైక్‌ని కుక్క తోలట్లేదనే అనుకోవాలి. ఎందుకంటే... వెనక కూర్చున్న ఇద్దరిలో... ఒక వ్యక్తి అప్పటివరకూ ఆ బైక్ డ్రైవ్ చేశాడు. ఐతే... కుక్క తనకు అనుకూలంగా... అలా ముందు కూర్చుంది. ఎలాగూ కుదురుగా ఉంది కదా అని దాని ముందు రెండు కాళ్లనూ అలా అటూ హ్యాండిల్స్‌కి ఆనించాడు. కుక్క అలా పోజిచ్చింది. బైక్ స్ట్రైట్ మోడ్‌లో ముందుకి వెళ్లిపోతుంటే... కుక్కే డ్రైవ్ చేసిన ఫీలింగ్ మనకు కలుగుతోంది.


ఇది బ్రెజిల్‌లో షూట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీన్ని వేల మంది చూస్తున్నారు. వందల మంది కామెంట్లు చేశారు. ఆ కుక్క బాగానే తోలుతోంది కానీ... హెల్మెట్ పెట్టుకోవాలి అని గుర్తుచేశారు ఓ నెటిజన్. ఆ క్కుక్కకు డ్రైవింగ్ స్కూల్‌లో ట్రైనింగ్ ఇచ్చారా అని మరో నెటిజన్ సరదాగా ప్రశ్నించారు. నాలుగు కాళ్ల రైడర్‌ని చూస్తున్నానని మరో నెటిజన్ స్పందించారు.


Pics : అందాల అప్సరస ఊర్వశి రౌతేలా



ఇవి కూడా చదవండి :

Diwali 2019 : ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం... అంతా పొగే...

TSRTC Strike : ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ... ఏం జరుగుతుంది?

Health Tips : మంట, నొప్పులను తరిమికొట్టే 7 అద్భుత ఆహారాలు

Health Tips : రోజూ 30 నిమిషాలు నడిస్తే...మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

Published by: Krishna Kumar N
First published: October 28, 2019, 8:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading