హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Video: నౌకలో చెలరేగిన మంటలు.. భయంతో సముద్రంలో దూకిన ప్రయాణికులు, సిబ్బంది.. తర్వాత ఏమైందంటే..

Video: నౌకలో చెలరేగిన మంటలు.. భయంతో సముద్రంలో దూకిన ప్రయాణికులు, సిబ్బంది.. తర్వాత ఏమైందంటే..

(Image-Twitter/@PisiKisi)

(Image-Twitter/@PisiKisi)

సముద్రంలో ఉండగానే ఓ నౌకలో మంటలు చెలరేగాయి. దీంతో భయపడిపోయిన సిబ్బంది, నౌకలో ఉన్న ప్రయాణికులు వెంటనే సుమద్రంలోకి దూకారు.

  సముద్రంలో ఉండగానే ఓ నౌకలో మంటలు చెలరేగాయి. దీంతో భయపడిపోయిన సిబ్బంది, నౌకలో ఉన్న ప్రయాణికులు వెంటనే సుమద్రంలోకి దూకారు. ఈ ఘటన తూర్పు ఇండోనేషియాలో శనివారం తెల్లవారుజామున జరిగింది. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో దాదాపు 200 మంది నీటిలోకి దూకేశారు. వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. నీటిలో దూకిన వందలాది మంది ప్రయాణికులను, సిబ్బందిని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. అనంతరం వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే ఒక వ్యక్తి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో ఆ వ్యక్తి కోసం రెస్క్యూ టీమ్స్ గాలింపు కొనసాగిస్తున్నట్టు అధికారులు ఆదివారం తెలిపారు.

  ఈ ఘటనపై the sea transportation directorate general అధికార ప్రతినిధి విష్ణు వర్దనా మాట్లాడుతూ.. ‘కేఎం కార్యా ఇందాహ్ పేరు గల నౌక లిమాఫటోలా ద్వీపంలోని సానానా పోర్టుకు బయలుదేరింది. నౌక బయలుదేరిన 15 నిమిషాలకే ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది చాలా మంది సముద్రంలోకి దూకేశారు. మొత్తం 181 ప్రయాణికులును రక్షించాం. వారిలో 22 మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అలాగే 14 మంది నౌక సిబ్బంది కూడా రక్షించబడ్డారు. నౌక ఇంజన్‌లో మంటలు చెలరేగినట్టుగా బాధితులు చెప్పారు. మంటలు చెలరేగడానికి కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది’అని తెలిపారు.


  ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను కొందరు ఫోన్లలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక, ఇండోనేషియాలో నౌక ప్రమాదాలు జరగడం చాలా సాధారణం. ఇండోనేషియా 17,000 ద్వీపాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప సముహ దేశంగా ఉంది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Fire Accident, Indonesia

  ఉత్తమ కథలు