Videos: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ఆటపాటలు... మస్త్ ఎంజాయ్

Video: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ఆటలు.. (image credit - twitter)

Viral Video: ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న భారతీయుల్ని ఇండియాకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అటు తాలిబన్లు మాత్రం పార్కులోకి వెళ్లి చిన్నపిల్లల్లా ఆడుకుంటున్నారు.

  • Share this:
    Videos: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. కాబూల్‌లోని ఓ ఎమ్యూజ్‌మెంట్ పార్కుకి వెళ్లిన తాలిబన్లు... అక్కడ చిన్న పిల్లలా రైడింగ్ చేస్తూ, ఆడుకుంటూ... కేరింతలు కొడుతున్నారు. ఎలక్ట్రిక్ బంపర్ కార్లలో కూర్చొని... చేతిలో ఆయుధాలతో రౌండ్లు కొడుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ఏమైపోతుందో అనే ఆలోచనే వారికి లేదు. ఉగ్రవాదులు కదా... వారికి దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటివి ఎక్కడుంటాయి....


    అదే పార్కులో మరో చోట ఇదిగో ఇలా గుర్రాల రైడింగ్ చేశారు.






    ఇదంతా చూస్తున్న ఆఫ్ఘాన్ ప్రజలు, పౌరులకు చాలా బాధ కలుగుతోంది. తమ దేశం సర్వనాశనం అయిపోతోందనే బాధ వారిలో కనిపిస్తోంది. తమ భవిష్యత్ ఏంటో అర్థం కాక వారు ఆకాశంవైపు ఆశగా చూస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: