హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Pakistan: పాకిస్తాన్‌లో ఆర్మీ బీభత్సం... సొంత పౌరులపై కాల్పుల వర్షం.. వీడియో

Pakistan: పాకిస్తాన్‌లో ఆర్మీ బీభత్సం... సొంత పౌరులపై కాల్పుల వర్షం.. వీడియో

ప్రజలపై పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు

ప్రజలపై పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు

కోహిస్తాన్ మారీ ప్రాంతంలో పౌరులపై పాకిస్తాన్ జవాన్లు కాల్పులు జరుపుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు మరణించారని బలూచ్ రిపబ్లిన్ పార్టీ ప్రకటించింది.

పాకిస్తాన్‌లో సైనికులు రెచ్చిపోయారు. సొంత పౌరులపైనే పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్లలోనే కాల్పులకు తెగబడుతున్నారు. మరణాయుధాలతో ఇష్టానుసారం దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రజలపై ఆర్మీ ఆగడాలు హద్దు మీరుతున్నాయి. కోహిస్తాన్ మారీ ప్రాంతంలో పౌరులపై పాకిస్తాన్ జవాన్లు కాల్పులు జరుపుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు మరణించారని బలూచ్ రిపబ్లిన్ పార్టీ ప్రకటించింది. ఆర్మీ దాడుల్లో ఎంతో మంది గాయపడ్డారని పేర్కొంది. అంతేకాదు మహిళలు, చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని బలూచ్ రిపబ్లికన్ పార్టీ నేత షేర్ మహమ్మద్ భుగ్తీ ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 9న భారీ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు.


పౌరులపై కాల్పులు జరుపడంతో పాటు ఆయుధాలతో చావ బాదుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లోని కోహిస్తాన్ జిల్లా దాసు హైడ్రోపవర్ ప్రాజెక్ట్ వద్ద ఈ కాల్పులకు తెగబడింది పాక్ ఆర్మీ. సింధు నదిపై దాసు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఐతే ఆ డ్యామ్ కోసం భూములను ఇచ్చిన స్థానికులు చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. భూములను ఇచ్చి తాము సర్వం కోల్పోయామని.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 9న ఆందోళనకారులపై ఆర్మీ కాల్పులు జరిపింది.

బలూచిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎప్పటి నుంచో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. అక్కడి ప్రజలను ఆర్మీ ఉక్కుపాదంతో అణచివేస్తోంది. దాడులకు పాల్పడుతూ హింసకు పాల్పడుతోంది. అంతర్జాతీయ వేదికగా ఎన్నోసార్లు దీనిపై పలు దేశాలు గళమెత్తాయి. తాజాగా మరోసారి పాక్ ఆర్మీ రెచ్చిపోతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేవారిని టార్గెట్ చేసి కాల్పులకు పాల్పడుతోంది.

First published:

Tags: Pakistan, Pakistan army

ఉత్తమ కథలు