Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో కొత్త ట్విస్ట్.. నేనే అధ్యక్షుడిని అని ప్రకటించుకున్న అమ్రుల్లా

అమ్రుల్లా సాలెహ్ (ఫైల్ ఫోటో)

ప్రస్తుతం తాను దేశంలోనే ఉన్నానని.. కాబట్టి తానే ఆఫ్ఘనిస్థాన్‌ ఆపద్ధర్మ అధ్యక్షుడినని తెలిపారు. ఈ విషయంలో అందరి మద్దతు పొందేందుకు తాను ప్రయత్నిస్తున్నానని అన్నారు.

  • Share this:
    తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అక్కడ మళ్లీ తాలిబన్ల ఆటవిక పాలన మొదలవుతుందని సాధారణ ప్రజలు భయపడిపోతున్నారు. అందుకే దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌కు తానే అధ్యక్షుడినని ఆ దేశ మొదటి ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలెహ్ ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు పారిపోవడం, చనిపోవడం లేదా రాజీనామా చేస్తే ఉపాధ్యక్షుడు ఆపద్ధర్మ అధ్యక్షుడు అవుతారని తెలిపారు. ప్రస్తుతం తాను దేశంలోనే ఉన్నానని.. కాబట్టి తానే ఆపద్ధర్మ అధ్యక్షుడినని తెలిపారు. ఈ విషయంలో అందరి మద్దతు పొందేందుకు తాను ప్రయత్నిస్తున్నానని అన్నారు.



    ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రెండు రోజుల క్రితం దేశం వదిలి వెళ్లిపోయారు. ఆయన జాతీయ భద్రతా సలహాదారు హమ్దుల్లా ముహిబ్‌తో కలిసి తజికిస్థాన్ వెళ్లిపోయినట్టు వార్తలు వచ్చాయి. మరికొందరు ఆఫ్ఘనిస్థాన్‌ నాయకులు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ పారిపోయారు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి అమెరికా, నాటో బలగాలు వెళ్లిపోవడంతో తాలిబన్లు మళ్లీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం మొదలుపెట్టారు.
    Published by:Kishore Akkaladevi
    First published: