VETERAN KOREAN ACTRESS KANG SOO YEON DIES AT 55 PAH
Hollywood: సినిమా ఇండస్ట్రీలో పెను విషాదం.. ఫేమస్ నటి కన్నుమూత.. కారణం అదే..
హలీవుడ్ నటి కాంగ్ సూ-యెన్..
Korean Actor: ప్రముఖ కొరియన్ నటి కాంగ్ సూ-యియోన్ (55) వ ఏటా కన్నుమూశారు. ఆమెను రెండు రోజులుగా దక్షిణ సియోల్ లోని ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఫేమస్ కొరియన్ నటి కాంగ్ సూ-యియోన్ (55) దక్షిణ సియోల్ లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండె పోటుతో మరణించారు. కాగా,కాంగ్ సూ (Kang Soo-Yeon) కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితమే దకిణ సియోల్ లోని (Southern Seoul) ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. ఆమెకు వైద్యులు అత్యవరస విభాగంలో ఉంచి చికిత్స అందించారు. ఆమె సెరిబ్రల్ హెమరేజ్ కారణంతో శనివారం తుదిశ్వాస విడిచారు.
ఆమె 1966 లో సియోల్ లో జన్మించారు. 1970 లో సినిమాలో రంగంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ప్రారంభించారు. ఆ తర్వాత.. 21 ఏళ్ల వయసులోనే వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇమ్ క్వాన్-టేక్ యొక్క ది సర్రోగేట్ వోంబ్లో తన పాత్రకు ఉత్తమ నటి బహుమతిని పొందారు. రెండు సంవత్సరాల తరువాత 1989లో, మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కమ్, కమ్, కమ్ అప్వర్డ్ - అదే దర్శకుడి నుండి వచ్చిన మరొక చిత్రం లో ఆమె బెస్ట్ యాక్టర్ గా అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె.. కాంగ్ ఇటీవల నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సైన్స్ ఫిక్షన్ మూవీ జంగ్-ఇ కోసం సన్నివేశాలను చిత్రీకరించారు, ఇది ఈ సంవత్సరం చివర్లో స్ట్రీమర్లో ప్రారంభమవుతుంది.
బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత గ్యాంగ్నెంగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఛైర్మన్ కిమ్ డాంగ్-హో నేతృత్వంలోని కమిటీతో కాంగ్ అంత్యక్రియలు బుధవారం జరగనున్నట్లు సమాచారం. కాంగ్ సూ-యియోన్ గుండెపోటు వలన ( cardiac arrest) ఆకస్మిక మరణంతో హలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.