సెర్బియా పార్లమెంట్‌లో వెంకయ్య చారిత్రక ప్రసంగం

ఐక్యరాజ్యసమితి, న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్స్ వంటి అన్ని ఫోరమ్స్ లోనూ భారతదేశానికి తమ మద్దతు ఉంటుందని సెర్బియా హామీ ఇచ్చింది.

news18-telugu
Updated: September 16, 2018, 7:40 PM IST
సెర్బియా పార్లమెంట్‌లో వెంకయ్య చారిత్రక ప్రసంగం
సెర్బియా పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • Share this:
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడికి అరుదైన గౌరవం లభించింది. సెర్బియా పార్లమెంట్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు. నెహ్రూ తర్వాత ఈ పార్లమెంట్ లో ప్రసంగించిన భారతీయుడు వెంకయ్యనాయుడే కావడం విశేషం. గంట పాటు సాగిన ఈ ప్రసంగంలో ఇరుదేశాల భాగస్వామ్య దృష్టిని, నాన్ ఎలైన్డ్ మూమెంట్ ప్రారంభించడంలో రెండు దేశాల నాయకులు పోషించిన పాత్రను ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్, ప్రధాన మంత్రి అనా బ్రాన్ బిక్, సెర్బియా నేషనల్ అసెంబ్లీ స్పీకర్ శ్రీమతి మజా గోజకోవికి తో కలిసి ద్వైపాక్షిక - బహుముఖ అంశాల మీద వెంకయ్యనాయుడు విస్తృతమైన చర్చలు జరిపారు. బిజినెస్ ఫోరమ్ సమావేశంలో ప్రసంగించారు.

భారత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో తీసుకెళుతున్న రాజకీయ నాయకత్వం మీద సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ ప్రశంసల జల్లు కురిపించారు. తమ శ్రేయస్సును కాంక్షించే భారత్ అలాంటి ఉన్నత స్థితిలో ఉన్నందుకు సంతోషిస్తున్నామన్నారు. ఐక్యరాజ్యసమితి, న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్స్ వంటి అన్ని ఫోరమ్స్ లోనూ భారతదేశానికి తమ మద్దతు ఉంటుందని సెర్బియా హామీ ఇచ్చింది. వ్యవసాయం, ఫార్మసీ, ఐటీ, జెనరిక్ ఔషధాలపై సెర్బియా ఆసక్తి కనబరించింది. సైనిక సాంకేతికత, సైనిక విద్యపై పరస్పర సహకారాన్ని అందించుకునేందుకు సెర్బియా సిద్ధంగా ఉందని ఆయన వివరించారు.


ఐరాస మానవ హక్కుల మండలికి వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో భారత్ కు మద్ధతు అందించాలని, ఉపరాష్ట్రపతి సెర్బియాను కోరారు. సెర్బియా అధ్యక్షుడు - భారత ఉపరాష్ట్రపతి సమక్షంలో ఇరుదేశాలు, రెండు ప్రధాన ఒప్పందాల మీద సంతకాలు చేశాయి. ఇందులో మొదటి ఒప్పందం పంటల సంరక్షణ, పండ్లు, కూరగాయలు, ప్రాసెస్ ఫుడ్స్ మీద కాగా రెండో ఒప్పందం ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ప్రసారాలు, వాణిజ్యం, పర్యాటక రంగాల అభివృద్ధికి సంబంధించింది.

సెర్బియా పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సెర్బియా పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Published by: Ashok Kumar Bonepalli
First published: September 16, 2018, 7:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading