ట్రంప్ యుద్ధానికి సిద్ధంగా ఉండు...అగ్రరాజ్యానికి వెనుజులా హెచ్చరిక...

అగ్రరాజ్యంతో సమరానికి సేనలను సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. అమెరికా వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

news18-telugu
Updated: August 3, 2019, 10:56 PM IST
ట్రంప్ యుద్ధానికి సిద్ధంగా ఉండు...అగ్రరాజ్యానికి వెనుజులా హెచ్చరిక...
వెనుజులా అధ్యక్షుడు మదురో
  • Share this:
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలపై వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశాన్ని చుట్టుముట్టి నిర్బంధానికి గురిచేస్తే అమెరికాతో యుద్ధం చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. అగ్రరాజ్యంతో సమరానికి సేనలను సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. అమెరికా వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అంతేకాదు వెనుజులాకు వ్యతిరేకంగా అమెరికా ఎలాంటి సైనిక చర్య దిగినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మదురో హెచ్చరించారు. అలాగే తమపై ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎన్ని ఆంక్షలు విధించినా రెట్టింపు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలతో వ్యవహరిస్తామని మదురో అన్నారు.

ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల వెనుజులాను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, ఆ దేశాన్ని దిగ్బంధించే అంశం పరిశీలనలో ఉందని అన్నారు. మరోవైపు వెనుజులాలో ప్రతిపక్ష నేత యువాన్‌ గ్వాయిడోను వెనుజులా దేశాధ్యక్షుడిగా గుర్తిస్తున్నామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో వెనుజులాలో ఘర్షణలు తలెత్తుతున్నాయి.

First published: August 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>