Viral Video: కాలేజీలో కారుతో రిస్కీ స్టంట్​​.. పోలీసులు సిరీయస్

Facebook image

వేగంగా వచ్చి ఒక్కసారిగా కారుతో ఫెన్సింగ్​ను దాటించాడు ఓ వ్యక్తి. ఆ వీడియో వైరల్ కావడంతో అలా చేసింది ఎవరనే విషయాన్ని కనుగొనేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

  • Share this:
    థ్రిల్ కోసమో.. తొందరేమైనా ఉందో.. వీడియో తీసుకునేందు కోసమో.. కానీ ఓ వ్యక్తి కారుతో ప్రమాదకమైన ఫీట్ చేశాడు. కాలేజీ వద్ద ఫెన్సింగ్​ను కారుతోనే దాటేశాడు. ఇందుకోసం వేగంగా వచ్చి కారును ఎగిరించాడు. చుట్టూ మంచు ఉన్న ప్రాంతంలో రిస్కీ  ఫీట్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అయింది. కెనడాలోని ఓ ​కాలేజీలో జరిగింది. ఈ విషయంపై ఆర్​సీఎంపీ పోలీసులు విచారణ ప్రారంభించారు.

    కెనడాలోని హైట్స్​ కాలేజీలో ఓ వ్యక్తి ఫెన్సింగ్ దాటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోస్ట్ చేసిన తక్కువ కాలంలో లక్షా 30 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. అలాగే పలు సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ల్లో వీడియో చక్కర్లు కొడుతోంది. 6977 గ్లాడ్​స్టోన్ ప్లేస్ వద్ద ఉన్న స్ట్రిప్ మాల్ వద్ద ఇది జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన కారు కాలేజీ సెకండరీ స్కూల్ ఫెన్సింగ్​ను దాటేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది.

    ఈ ఘటనకు పాల్పడిన, వీడియో తీసిన వ్యక్తులు వారంతటవారే ముందుకు రావాలని కూడా పోలీసులు సూచించారు. “ఈ ప్రాంతంలో ఇది చాలా ప్రమాదకరమైన స్టంట్​” అని పోలీసు శాఖ ప్రతినిధి జెన్నిఫర్ కూపెర్ చెప్పారు. “షాపింగ్ మాల్​లో ఎక్కువ మంది ఉండే సమయం అది. అలాగే పిల్లలు కూడా అక్కడ ఎప్పుడూ తిరుగుతుంటారు. ఒకవేళ ఆ కారును చూసినా.. ఆ డ్రైవర్ ఎవరో తెలిసినా చెప్పాలని ప్రజలను కూడా కోరుతున్నాం” అని కూపెర్ కోరారు.


    అలాగే చుట్టు పక్కల ప్రాంతాల్లోనే సీసీ టీవీల ఫుటేజీలను పరిశీలించి ఆ కారును నడిపిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పారు.

    లగ్జరీ కార్లతో విన్యాసాలు అమెరికాలో సాధారణే అయినా కాలేజీ అందులో రద్దీ ప్రాంతం, మంచు కూడా ఉండడంతో పోలీసులు సీరియస్​గా ఉన్నారు.
    Published by:Krishna P
    First published: