వ్యాక్సిన్ ప్రక్రియలో అమెరికా అన్ని దేశాలకంటే ముందే ఉంది. ఆ దేశంలో వ్యాక్సిన్ తయారి లేకున్నా.. బయటి దేశాల నుండి కుప్పలు తెప్పలుగా వ్యాక్సిన్ స్టాక్‌ను ఏర్పాటు చేసుకుంది. దీంతో అన్ని దేశాల కంటే ముందుగానే ఆ దేశ పౌరులకు వ్యాక్సిన్ ఇప్పించే ఏర్పాట్లు చేసింది. దీంతో మాస్క్ ఫ్రీ ని కూడా ప్రకటించారు. దీంతో పలు దేశాల్లో ఇంకా 18 సంవత్సరాలు నిండిన వారికే టీకాలు వేయించని నేపథ్యంలోనే 12 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ప్రక్రియను ఆ దేశంలో కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే మరో తాజా నిర్ణయాన్ని ప్రకటించింది.
ఈ క్రమంలోనే 5-11 ఏళ్ల పిల్లలకు ( child ) వచ్చే నెల నుంచి టీకాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వైట్‌హౌస్ బుధవారం ప్రకటించింది. వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం నుంచి అనుమతులు రాగానే పిల్లలకు వ్యాక్సిన్లు అందిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ఆరోగ్యశాఖ నిపుణుల సూచనల మేరకు ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించింది. 5-11 ఏళ్ల పిల్లలకు శిశువైద్యుల కార్యాలయాలు, స్థానిక ఫార్మసీలు, వారి పాఠశాల్లోనూ ఫైజర్ టీకాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికార యంత్రాంగం పేర్కొంది.
ఇది చదవండి : ఇలా చేస్తోంది ఏమిటీ... భర్త చితభస్మాన్ని వెంటపెట్టుకుని అప్పుడప్పుడు అలా.. !
నవంబర్‌లో ( november ) మొదటి టీకా తీసుకున్నవారికి డిసెంబర్లో రెండో డోసు వేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే టీకా భద్రత, రక్షణపై నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు సైతం ముమ్మర చర్యలు చేపడుతోంది. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరులు, వారి పిల్లలకు భరోసా కల్పిస్తోంది. ప్రజలు టీకాలు తీసుకునేలా.. విద్యావేత్తలు, వైద్యులు, నేతలతో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపింది..
ఇది చదవండి : ఉద్యోగాలు వీడుతున్న లక్షల మంది... కరోనా తర్వాత అమెరికన్లలో కొత్త ధోరణి.
మరోవైపు అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే ( one day ) 83 వేల మందికి పాజిటివ్‌గా ( corona positive ) నిర్ధరణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు వైరస్ బారిన పడ్డవారి సంఖ్య 4.51 కోట్లకు చేరింది. వైరస్‌తో మొత్తంగా 7.28 లక్షల మంది మృతిచెందారు. కాగా 12-18 ఏళ్లవారితో కలిసి అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 21.9 కోట్ల మంది కనీసం ఒక్కడోసు తీసుకున్న వారు ఉండగా ..మొత్తం 19 కోట్ల మంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు తీసుకున్నట్టు తెలిపారు.
ఇది చదవండి : తాలిబాన్ మరో అరాచకం.. జాతీయ మహిళ వాలిబాల్ క్రిడాకారిణి తల నరికారు... !
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Corona Vaccine