Not Entirely Safe: వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన వాళ్లంతా సేఫ్ కాదు.. సీడీసీ ఏం చెప్పిందంటే..

సీడీసీ

కోవిడ్-19 టీకా తీసుకున్న వృద్ధులకు సంబంధించి యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) కీలక విషయాలను వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన వయసు పైబడిన వారంతా సురక్షితంగా ఉన్నట్టు కాదని, ఆ వృద్ధుల చుట్టూ ఉండే వారు వ్యాక్సిన్ తీసుకోని వారయితే వృద్ధులు ప్రమాదంలో పడినట్టేనని సీడీసీ తెలిపింది.

  • Share this:
    కోవిడ్-19 టీకా తీసుకున్న వృద్ధులకు సంబంధించి యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) కీలక విషయాలను వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన వయసు పైబడిన వారంతా సురక్షితంగా ఉన్నట్టు కాదని, ఆ వృద్ధుల చుట్టూ ఉండే వారు వ్యాక్సిన్ తీసుకోని వారయితే వృద్ధులు ప్రమాదంలో పడినట్టేనని సీడీసీ తెలిపింది. కోవిడ్-19 సోకి ఆరోగ్యం విషమించే అవకాశం, చనిపోయే ప్రమాదం వృద్ధుల్లోనే ఎక్కువ ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సీడీసీ గణాంకాల ప్రకారం.. కోవిడ్-19 సోకి చనిపోయిన వారిలో దాదాపు 80 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వృద్ధులేనని తెలిసింది. అంతేకాదు.. 95 శాతం కోవిడ్ మరణాల్లో 45 ఏళ్లు పైబడిన వారేనని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కరోనా వల్ల ఎక్కువ రిస్క్ ఉండేవారిలో వృద్ధులను చేర్చి వారికి వ్యాక్సిన్ ఇచ్చాయని.. అయితే వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన వాళ్లు సేఫ్ కాదని.. వాళ్ల చుట్టూ ఉండే వాళ్లు కూడా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడే వృద్ధులకు కరోనా ముప్పు తప్పుతుందని సీడీసీ తెలిపింది.

    అంతేకాదు.. సీడీసీ అధ్యయనంలో మరో ఆందోళన కలిగించే అంశం కూడా వెల్లడైంది. కరోనా కొత్త వేరియంట్లు వృద్ధులపైనే విరుచుకుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అందువల్ల వ్యాక్సిన్ యొక్క అవసరాన్ని తెలిపి వృద్ధులందరూ టీకా తీసుకునేలా అవగాహన కల్పించాలని సీడీసీ సూచించింది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్’లో పబ్లిష్ చేశారు. ఈ అధ్యయనం లోతుపాతుల్లోకి వెళితే.. వృద్ధులలో SARS-CoV-2ను ఎదుర్కొనే యాంటీబాడీస్ తక్కువగా ఏర్పడుతున్నాయని స్టడీలో తేలింది. వైరస్, బ్యాక్టీరియాలను ఎదుర్కొనేందుకు మన శరీరం స్వతహాగా తయారుచేసుకునే బ్లడ్ ప్రొటీన్స్‌నే యాంటీ‌బాడీస్ అంటారు.

    యువతతో పోల్చితే కరోనా కొత్త వేరియంట్ల ప్రభావం వృద్ధులపైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు.. 20 ఏళ్ల వయసున్న యువతలో.. 70 నుంచి 82 సంవత్సరాల వయసున్న వృద్ధులతో పోల్చుకుంటే యాంటీబాడీస్ 7 రెట్లు ఎక్కువగా ఏర్పడ్డాయని అధ్యయనంలో తేలింది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడమే అందుకు మార్గమని.. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉంటుందని సీడీసీ తెలిపింది.
    Published by:Sambasiva Reddy
    First published: