హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Island : పాపం ఐలాండ్ లో ముగ్గురు..33 రోజులు... తిండి తిప్పలు లేవు..ఎలా బతికారో తెలుసా..

Island : పాపం ఐలాండ్ లో ముగ్గురు..33 రోజులు... తిండి తిప్పలు లేవు..ఎలా బతికారో తెలుసా..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Island : ఆ ముగ్గురు అనుకోకుండా ఓ ఐలాండ్ లో చిక్కుకుపోయారు. తినడానికి తిండి లేదు. ఎటు చూసినా సముద్రపు నీళ్లే. ఏం చేయాలో తెలియని పరిస్థితి. భయంతో బిక్కుబిక్కు మంటూ 33 రోజులు గడిపారు. ఆ 33 రోజులు తిండి తిప్పలు లేకుండా ఎలా బతికారో తెలుసా.

ఇంకా చదవండి ...

ఆ ముగ్గురు అనుకోకుండా ఓ ఐలాండ్ లో చిక్కుకుపోయారు. తినడానికి తిండి లేదు. ఎటు చూసినా సముద్రపు నీళ్లే. ఏం చేయాలో తెలియని పరిస్థితి. భయంతో బిక్కుబిక్కు మంటూ 33 రోజులు గడిపారు. ఆ 33 రోజులు ఆ ముగ్గురు తిండి తిప్పలు లేకుండా ఎలా బతికారో తెలుసా. కొబ్బరి బొండాలే ఆ ముగ్గుర్ని బతికించాయ్. అవును మీరు విన్నది నిజమే. వివరాల్లోకెళితే.. కరేబీయన్ దీవుల్లో ఒకటైన బహమస్ దీవి నుంచి ఒక మహిళ, ఇద్దరు పురషుల్ని అమెరికా కోస్ట్ దళం కాపాడింది. హెలికాప్టర్ ద్వారా ఆ ముగ్గుర్ని దీవి నుంచి కాపాడారు అమెరికా కోస్డ్ గార్డ్ అధికారులు. వెంటనే ఆ ముగ్గుర్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ ముగ్గుర అధికారులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఐదు వారాల క్రితం ఆ ముగ్గురు ఓ చిన్న పడవలో సముద్రపు అందాలు చూడటానికి బయలు దేరారు. కానీ, సముద్రపు అలల తాకిడితో వారి ప్రయాణిస్తున్న పడవ బహుమస్ దీవికి కొట్టుకొచ్చింది. ఇంకే ముంది ఆ దీవిలో చిక్కుకుపోయారు. అటువైపు ఏ పడవ కానీ, పెద్ద నౌకలు కానీ రాలేదు. ఆ ముగ్గురు ఎవరైనా వస్తారు.. మాకు సాయం చేస్తారని ఎదురుచూశారు. కానీ ఫలితం లేకపోయింది.

ఫస్ట్ రెండు రోజులు వారి దగ్గర ఉన్న తిండితో ఎలాగాలో సర్దుకుపోయారు. కానీ అక్కడి నుంచే అసలు కష్టాలు మొదలయ్యాయ్. ఆ దీవిలో తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్లు లేవు. ఎటు చూసిన సముద్రపు నీళ్లే. ఈ సమయంలో కొబ్బరి బొండాలే వారి పాలిట వరంగా మారాయ్. దీవిలో కొబ్బరి చెట్లు ఉండటం వారికి కలిసొచ్చొంది. ఆ కొబ్బరి బొండాల్లో నీళ్లు తాగుతూ.. కొబ్బరిని తింటూ ఎలాగాలో 33 రోజులు బతికారు.

అయితే, ఒక రోజు అమెరికా కోస్ట్ గార్డ్ దళానికి చెందిన హెలికాప్టర్ ఆ దీవి వెంట చక్కర్లు కొట్టడం ఆ ముగ్గురికి కన్పించింది. దీంతో వారిలో ఆశలు చిగురించాయ్. అధికారులకు కన్పించేలా సిగ్నల్స్ ఇచ్చారు. వారి ఇచ్చిన సంకేతాలతో కోస్ట్ గార్డ్ అధికారులు ఆ ముగ్గుర్ని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ముగ్గురు ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. ఆ ముగ్గురు క్యూబా దేశానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు.

First published:

Tags: Trending, VIRAL NEWS

ఉత్తమ కథలు