వర్షాలు వరదలు వచ్చినప్పుడు చెట్లు కూలిపోవడం చూస్తుంటాం. పెద్ద ఎత్తన ఈదురు గాలులు వీస్తే.. చెట్లు కుప్పకూలుతాయి. భూకంపాలు వచ్చినప్పుడు కూడా చెట్లు పడిపోతాయి. కానీ ఎండల వేడిమికి కూడా చెట్లు దెబ్బతింటాయని ఎప్పుడైనా విన్నారా. అది కూడా బాంబులా పేలిపోయిందంటే నమ్ముతారా? కానీ ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఎండల తీవ్రత వల్ల ఓ పురాతనమైన భారీ వృక్షం (Tree Blast).. పెద్ద శబ్ధంతో పేలిపోయింది. పేలుడు ధాటికి ఆ పెద్ద చెట్టు ముక్కలు ముక్కలయింది. అమెరికా (America)లోని పోర్ట్‌ల్యాండ్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.
పోర్ట్‌ల్యాండ్‌లో గత ఏడు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. బయటకు అడుగుపెట్టాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. అక్కడ ప్రతిరోజూ 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 35 డిగ్రీలు పెద్ద లెక్కా.. మన వద్ద 40 డిగ్రీలు దాటిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని అనుకోవద్దు. వారికి ఈ ఉష్ణోగ్రతే చాలా ఎక్కువ. ఆ వేడిని తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఐతే ఈ సూర్య తాపం, ఆవిరి వల్ల.. పోర్ట్‌ల్యాండ్‌లోని ఓ ఓక్ చెట్టు కాండం లోపల తీవ్రమైనమైన ఒత్తిడి ఏర్పడింది. ఆ పీడనానికి చెట్టుకాండం భారీ శబ్ధంతో పేలిపోయింది. ఆ చెట్టు చాలా పురాతనమైనది. దాదాపు 200 ఏళ్ల క్రితం (Blast In 200 Year Old Tree) నాటిది. దాని బరువు 13వేల కిలోల వరకు ఉంటుంది. అంత పెద్ద చెట్టు పేలిపోవడంతో.. దాని కాండా ముక్కలు ముక్కలుగా ఎగిరిపడింది. ఈ ఘటన వల్ల విద్యుత్ వైర్లు తెగి.. కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. ఐతే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగేలేదని పోర్ట్‌ల్యాండ్ అధికారుతు తెలిపారు.
ఏకంగా కరాటే మాస్టర్ కే చుక్కలు చూపిస్తున్న చిన్నారి.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే
చెట్టు పేలిపోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అసలు ఆ చెట్టు ఎలా పేలింది? దానికి గల కారణాలేంటన్న దానిపై మైఖేల్ జోలిఫ్ అనే ఆర్బరిస్ట్ ఫాక్స్ 12 టీవికి వివరించారు. మైఖేల్ జోలిఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం... సుదీర్ఘమైన వేడి కారణంగా చెట్టు కాండంలో గ్యాస్ పీడనం ఏర్పడుతుంది. గ్యాస్ పీడనం ఏర్పడి ఉండాలి. ఆ పీడనం క్రమంగా పెరుగుతూ.. చివరకు కాండం కణజాలం అకస్మాత్తుగా పేలుతుంది. ఇటువంటి పేలుళ్లు పాత చెట్లలో ఎక్కువగా కనిపిస్తాయి. అవి కాలక్రమేణా బలహీనపడడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయని మైఖేల్ జోలిఫ్ తెలిపారు.
ఓక్ చెట్టు పేలుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే అక్కడి ప్రజలు ఎప్పుడూ ఇలాంటి ఘటనలను చూడలేదు. కనీసం వినలేదు. పేలుడు శబ్దం చాలా దూరం వరకు వినబడింది. చెట్టు లోపల ఎవరో డైనమైట్ పెట్టి పేల్చినట్టుగా భారీ శబ్ధం రావడంతో అందరూ షాకయ్యారు. పర్యావరణ మార్పుల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. భవిష్యత్‌లో ఇలాంటివి మరిన్ని జరిగే అవకాశముందని మైఖేల్ జోలిఫ్ వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amercia, International, International news, Us news