USA OFFERS 10 MILLION DOLLERS REWARD FOR INFORMATION ON ISKP LEADER PVN
Reward : అతడి ఆచూకీ చెప్పినోళ్లకు రూ.75 కోట్లు ఇస్తారంట..వాట్సాప్ లో కూడా సమాచారమివ్వచ్చు
ఐసిస్-కె నాయకుడు షనాల్లా గఫారీ
75 Crores Reward On ISKP leader : గెరిల్లా యుద్ధ తంత్ర, ఆత్మహుతి దాడులు ప్లాన్ చేయడంలో గఫారీ దిట్ట. గఫారీ ఆచూకీ తెలిపిన వారికి భారీ నజరానా ప్రకటించింది అమెరికా(USA). వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని తెలపవచ్చని రివార్డ్ ఫర్ జస్టిస్ ఓ ట్వీట్ లో తెలిపింది.
Reward on ISKP leader : గతేడాది చివర్లో అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో గతేడాది బాంబు పేలుళ్లకు కారణమైన ఐసిస్-కె(ISIS-K)నాయకుడు షనాల్లా గఫారీ ఆచూకీ తెలిపిన వారికి భారీ నజరానా ప్రకటించింది అమెరికా(USA).కాబుల్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిలో(Kabul Airport Blast)ప్రధాన సూత్రధారి అయిన షనాల్లా గఫారీ ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.75 కోట్లు) ఇస్తామని అమెరికా రివార్డ్ ఫర్ జస్టిస్ విభాగం తెలిపింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని తెలపవచ్చని రివార్డ్ ఫర్ జస్టిస్ ఓ ట్వీట్ లో తెలిపింది.
గతేడాది ఆగస్టులో తాలిబన్లు కాబూల్ ని ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. కాబూల్ ఆక్రమణతో అప్ఘానిస్తాన్ ని పూర్తిగా తమ చేతుల్లోకి వచ్చినట్లు తాలిబన్లు ప్రకటించుకున్నారు. అయితే కాబూల్ ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న సమయంలో అప్ఘాన్ లో 20 ఏళ్ల పోరాటానికి ముగింపు పలికి అమెరికా... తమ పౌరులు, అధికారులను తరలిస్తుండగా ఆగస్టు 26న కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రదాడి జరిగింది. ఉగ్రదాడి కారణంగా 170 మంది అప్ఘాన్ పౌరులతో పాటు 13 మంది యూఎస్ సర్వీస్ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. పలువురు అమెరికా సిబ్బంది కూడా గాయపడినవారిలో ఉన్నారు. అయితే ఈ ఉగ్రదాడికి కుట్ర చేసింది గఫారీ అని అమెరికా కనిపెట్టింది. దీంతో గత ఏడాది నవంబర్ లో గ్లోబల్ టెర్రరిస్ట్ గా షనాల్లా గఫారీని ప్రకటించారు.
షనాల్లా గఫారీ.. అప్ఘాన్ లో 1994లో జన్మించాడు. హక్కానీ నెట్‌వర్క్‌లో మొదట పనిచేసి.. ఆ తర్వాత ఐసిస్ లో చేరాడు. 2020లో ఐసిస్-కేకు అల్ ముజాహిర్ గా నియమించింది ఉగ్రవాద సంస్థ. ఆ తర్వాత ఐసిస్-కేకు గఫారీ కీలక నేతగా మారాడు.
ప్రస్తుతం ఐఎస్ఐఎస్-కె ఉగ్రవాద సంస్థకి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆ సంస్థ అప్ఘానిస్తాన్ లో జరుపుతున్న ఉగ్ర కార్యక్రమాలకు నిధులు సమకూర్చుతున్నట్లు సమాచారం. గెరిల్లా యుద్ధ తంత్ర, ఆత్మహుతి దాడులు ప్లాన్ చేయడంలో గఫారీ దిట్ట. అప్ఘాన్ వ్యాప్తంగా అర్బన్ లయన్స్ గా వీరిని పిలుస్తారు. ముఖ్యంగా దాడులకు పాల్పడటం, నిధులు సేకరించడం వీరి ఆధీనంలో ఉంటుంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.