హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia-Ukraine War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా జర్నలిస్ట్ మృతి

Russia-Ukraine War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా జర్నలిస్ట్ మృతి

రష్యా దాడిలో అమెరికా జర్నలిస్ట్ మృతి

రష్యా దాడిలో అమెరికా జర్నలిస్ట్ మృతి

USA JOURNALIST DIED : చనిపోయిన వ్యక్తి ఇప్పటికే పాత్రికేయ రంగంలో పలు గొప్ప అవార్డులు అందుకున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. జర్నలిస్ట్​ మృతిపై పలు పాత్రికేయ సంఘాలు సంతాపం తెలిపాయి.

USA JOURNALIST DIED :  ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం ఆదివారం నాటికి 18వ రోజుకు చేరింది. ఉక్రెయిన్‌పై ఎలాగైనా పట్టు సాధించాలనుకుంటున్న రష్యా ఎంతమాత్రం వెనక్కి తగ్గకుండా బాంబులు, రాకెట్లను సంధిస్తోంది. అయితే ఉక్రెయిన్‌ లో రష్యా బలగాల దాడిలో తాజాగా అమెరికాకు చెందిన వీడియో జర్నలిస్ట్‌ మృతి చెందాడు. ఆదివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ నగర శివారులోని ఇర్పిన్‌ లో రష్యా దళాలు జరిపిన కాల్పుల్లో అమెరికా జర్నలిస్ట్‌ మృతి చెందగా.. మరో జర్నలిస్ట్‌ గాయపడ్డట్లు ఉక్రెయిన్‌ అధికారులు ధ్రువీకరించారు. మృతుడిని బ్రెంట్ రెనాడ్ ​గా గుర్తించారు అధికారులు. ఈ మేరకు అతని మృతదేహాంతో పాటు సంస్థ గుర్తింపు కార్డు, అమెరికా పాస్​ పోర్ట్​ను మీడియాకు చూపించారు.

అయితే, మొదట అతను అమెరికాలోని ప్రతిష్ఠాత్మక వార్త సంస్థ అయిన న్యూయార్క్ టైమ్స్ ఉద్యోగిగా భావించారు. కానీ, ప్రస్తుతం బ్రెంట్ తమ సంస్థలో పని చేయడం లేదని న్యూయార్క్ టైమ్స్ యాజమాన్యం ప్రకటించింది. ఘటనాస్థలంలో దొరికిన ఐడీ కార్డు చాలా ఏళ్ల క్రితం జారీ చేసిందని స్పష్టం చేసింది. చనిపోయిన వ్యక్తి ఇప్పటికే పాత్రికేయ రంగంలో పలు గొప్ప అవార్డులు అందుకున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. జర్నలిస్ట్​ మృతిపై పలు పాత్రికేయ సంఘాలు సంతాపం తెలిపాయి.

ALSO READ U.S Consulate : అమెరికా కాన్సులేట్ పై 12 మిసైల్స్ తో దాడి

మరోవైపు ఆయా నగరాల్ని వీలైనంత త్వరగా గుప్పిట పట్టేందుకు రష్యన్‌ సేనలు కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నాయి. సామాన్య పౌరులకు అందుతున్న సహాయక చర్యలను సైతం అడ్డుకుంటున్నాయి. సైనిక సామగ్రి సరఫరాపైనా అస్త్రాలను ఎక్కుపెడుతున్నాయి. శనివారం దాదాపు 4.30లక్షల మంది జనాభా ఉన్న మరియోపోల్‌కు అందుతున్న సాయాన్ని రష్యన్‌ సేనలు అడ్డుకున్నాయి. ఆహారం, మంచినీరు, ఔషధాల వంటి సామగ్రితో వెళుతున్న ట్రక్కులపైనా దాడులు జరిగాయి. అలాగే నగరాన్ని వీడి వెళుతున్న పౌరులనూ అడ్డుకుంటుండడం గమనార్హం.

ALSO READ Mahasweta Chakraborty: 800 మంది భారతీయులను కాపాడిన మహిళ పైలేట్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ఇదిలా ఉండగా.. కీవ్‌ కు 20 కి.మీ దూరంలోని ఓ గ్రామం నుంచి ట్రక్కుల్లో వెళుతున్న కొంతమందిపై రష్యన్‌ సైనికులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో చిన్నారులు, మహిళలు సహా 7 మంది పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి. ఆదివారం పశ్చిమ ఉక్రెయిన్ ​లోని ఎల్వివ్‌కు వాయువ్యంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక శిక్షణ స్థావరంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 35 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఉక్రెయిన్​కు సాయంగా ఆయుధాలు సరఫరా చేస్తే.. ఆ వాహనాలు తమకు లక్ష్యాలుగా మారుతాయని రష్యా హెచ్చరించిన నేపథ్యంలో పోలాండ్ ​కు సరిహద్దుల్లో ఈ దాడి జరిగింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Journalist, Russia, Russia-Ukraine War, USA

ఉత్తమ కథలు