హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

USA Firing: అమెరికాలో కాల్పులు.. బర్త్‌డే పార్టీలో దారుణం.. గన్‌మేన్ సహా ఏడుగురు మృతి

USA Firing: అమెరికాలో కాల్పులు.. బర్త్‌డే పార్టీలో దారుణం.. గన్‌మేన్ సహా ఏడుగురు మృతి

USA Firing: ప్రాణ రక్షణ కోసం అంటూ గన్ లైసెన్స్ తీసుకోవడం... అదే గన్‌తో ప్రాణాలు తియ్యడం అమెరికాలో కామన్ అయిపోతోంది. అసలీ ఘటనలో అతను ఎందుకీ ఫైరింగ్‌కి పాల్పడ్డాడు?

USA Firing: ప్రాణ రక్షణ కోసం అంటూ గన్ లైసెన్స్ తీసుకోవడం... అదే గన్‌తో ప్రాణాలు తియ్యడం అమెరికాలో కామన్ అయిపోతోంది. అసలీ ఘటనలో అతను ఎందుకీ ఫైరింగ్‌కి పాల్పడ్డాడు?

USA Firing: ప్రాణ రక్షణ కోసం అంటూ గన్ లైసెన్స్ తీసుకోవడం... అదే గన్‌తో ప్రాణాలు తియ్యడం అమెరికాలో కామన్ అయిపోతోంది. అసలీ ఘటనలో అతను ఎందుకీ ఫైరింగ్‌కి పాల్పడ్డాడు?

  Colorado Firing: అది అమెరికాలోని కొలరాడో... బర్త్‌డే పార్టీ జరుగుతోంది. అర్థరాత్రి సమయం. మొబైల్ హోమ్ బయట ఉన్న పార్క్ దగ్గర అతిథులతో పార్టీ ఆనందంగా సాగుతోంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో గానీ ఒకడొచ్చాడు. ఒక్కసారిగా జనంపై కాల్పులు జరిపాడు. ఈ ఫైరింగ్‌లో ఐదుగురు పెద్దవాళ్లు చనిపోయారు. ఆ బుల్లెట్ల సౌండ్‌కి అక్కడున్నవారంతా... ప్రాణ భయంతో తలో దిక్కుకూ పరుగులు పెట్టారు. ఒక్కసారిగా బర్త్ డే పార్టీ కాస్తా... డెత్ డే అయిపోయింది. కాల్పులు జరిపిన వ్యక్తి... వెంటనే అదే గన్‌తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. వెంటనే విషయం పోలీసులకు తెలిసింది. అర్థరాత్రి కాల్పులు జరిపిందెవడ్రా... అనుకుంటూ... హడావుడిగా వచ్చారు. గన్‌మేన్ సహా ఆరుగురు చనిపోయారని అర్థమైంది. మరో వ్యక్తి మృత్యువుతో పోరాడుతుంటే... ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆస్పత్రిలో అతను చనిపోయాడు. దాంతో మరణాల సంఖ్య 7కి చేరింది.

  ప్రేమ వ్యవహారమే కారణమా?

  ఇంత మందిని లేపేసి... తనూ చనిపోయాడంటే... అతను కావాలని ఈ నేరం చెయ్యలేదు. అతనిలో ఏదో కసి, కోపం ఉంది. ఆ కసి తీర్చుకునేందుకే ఇలా బలవంతంగా ఫైరింగ్ చేసి... ఆ తర్వాత తనలో ఉన్న బాధతో సూసైడ్ చేసుకున్నాడు అని పోలీసులు ఊహించుకొని... కారణం తెలుసుకునేందుకు ఆరా తీశారు. ఇంతలో ఓ వ్యక్తి అతను నాకు తెలుసు. ఈ పార్టీకి వచ్చిన వారిలో ఓ అమ్మాయికి అతను లవర్. ప్రేమ వ్యవహారంలోనే ఏదో తేడా కొట్టి ఉంటుంది అన్నాడు. ఎవరికోసమైతే ఈ బర్త్ డే పార్టీ జరిగిందో, వారు కూడా ఈ కాల్పుల్లో చనిపోయారు అని పోలీసులు తెలిపారు.

  పోలీసులు చనిపోయిన వ్యక్తి ఫొటో లేదా ఇతర వివరాలేవీ బయటపెట్టలేదు. అతను ఎందుకు ఇలా చేశాడో ఇంకా మాకు తెలియలేదు. త్వరలోనే తెలుసుకుంటాం అని పోలీసు అధికారులు చెప్పారు. ఈ ఘటన దురదృష్టకరం. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు మా సంతాపం తెలుపుతున్నాం... అని కొలరాడో స్ప్రింగ్స్ పోలీస్ చీఫ్ విన్స్ నిస్కీ తెలిపారు.

  ఇది కూడా చదవండి: Lassi Health Benefits: రోజూ లస్సీని ఇలా తాగితే రెట్టింపు ఆరోగ్యం

  ఇదే కొలరాడోలో మార్చి 22న ఇలాగే ఓ గన్‌మేన్... సూపర్ మార్కెట్‌కి వెళ్లి గన్‌లో బుల్లెట్లు వేస్ట్ చేశాడు. ఆ ఘటనలో 10 మంది చనిపోయారు. అప్పట్లో అదో సంచలనం అయ్యింది. ఇప్పుడు మరో ఘటన. ఇలా అమెరికాలో తరచూ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదుల టెన్షన్ కంటే... ఈ గన్ కల్చర్ టెన్షన్ ఎక్కువైపోయింది అక్కడ.

  First published:

  Tags: America, Breaking news, USA

  ఉత్తమ కథలు