పాకిస్థాన్‌కి షాక్... హఫీజ్ సయీద్‌, దావూద్ ఉగ్రవాదులే... భారత్‌కి అమెరికా సపోర్ట్...

Stand with India : హపీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఇండియా ఎప్పటి నుంచో కోరుతున్నా... ఎన్నో అడ్డంకులు. తాజా భారత్‌కి అమెరికా మద్దతివ్వడంతో... ఇక ఈ విషయంలో పాకిస్థాన్‌కి మూడినట్లే.

Krishna Kumar N | news18-telugu
Updated: September 5, 2019, 10:58 AM IST
పాకిస్థాన్‌కి షాక్... హఫీజ్ సయీద్‌, దావూద్ ఉగ్రవాదులే... భారత్‌కి అమెరికా సపోర్ట్...
దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్ (File)
  • Share this:
ఉగ్రవాదంపై పోరాటం విషయంలో భారత్‌కి పూర్తి మద్దతిస్తామన్న అమెరికా... కొత్త ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద... లష్కరే తోయిబా స్థాపకుడు హఫీజ్ సయీద్ తోపాటూ... మరో ముగ్గురిపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం... ఉగ్రవాదంపై పోరాటం విషయంలో భారత్‌తో తమ సహకారాన్ని మరింత బలపరిచే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయపడింది. హఫీజ్‌తోపాటూ... మౌలానా మసూద్ అజార్, జకివుర్ రెహ్మాన్ లక్వీ, దావూద్ ఇబ్రహీం కూడా ఇకపై అంతర్జాతీయ ఉగ్రవాదులే. మసూద్ అజార్... జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ స్థాపకుడు, జకివుర్ రెహ్మాన్ లక్వీ... కాశ్మీర్‌లో లష్కరే తోయిబా సుప్రీం కమాండర్‌గా పనిచేస్తున్నాడు. ఇక దావూద్ ఇబ్రహీం... అండర్‌వరల్డ్ డాన్. ముంబై మాఫియా సహా.. ఆయుధాల సరఫరా, స్మగ్లింగ్ అన్నీ దావూద్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అందువల్లే ఆమెరికా వీళ్లు నలుగురినీ... చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధిత) చట్టం (UAPA) కింద ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఇకపై వీళ్లు నలుగురూ... ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం అంతర్జాతీయ ఉగ్రవాదులే.


అమెరికా తెచ్చిన కొత్త చట్టం (సవరించిన చట్టం) వల్ల భారత ప్రభుత్వం ఇకపై వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించవచ్చు. అమెరికాతో కలిసి... ఉగ్రవాదంపై ఆయా వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాడవచ్చు. ఇదివరకు (కొత్త చట్టం రాకముందు) సంస్థలను మాత్రమే ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించే హక్కు భారత ప్రభుత్వానికి ఉండేది. కొత్త చట్టంలో ఉగ్రవాదులు, స్మగ్లర్లు, మత్తు పదార్థాల అక్రమ సరఫరా దారులు అందరినీ అమెరికా ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటిస్తుంది.

First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు