వావ్... నదిలో పడిన ఐఫోన్... ఏడాది తర్వాత కూడా పనిచేస్తోందిగా...

IPHONE : అమెరికాకు చెందిన ఆ యూట్యూబర్... నదిలో పడిపోయిన మొబైల్‌ను సంవత్సరం తర్వాత కనిపెట్టాడు. ఆశ్చర్యమేంటంటే ఆ ఐఫోన్ ఏడాది తర్వాత కూడా చక్కగా పనిచేస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: October 1, 2019, 9:22 AM IST
వావ్... నదిలో పడిన ఐఫోన్... ఏడాది తర్వాత కూడా పనిచేస్తోందిగా...
నదిలో పడిన ఐఫోన్... ఏడాది తర్వాత కూడా పనిచేస్తోందిగా... (Credit - YT - nuggetnoggin)
  • Share this:
యూట్యూబర్ మైకేల్ బెన్నెట్ ఓ ట్రెజర్ హంటర్. అంటే... నదుల్లో పడివున్న వస్తువుల్ని, ఖనిజాల్నీ అతను కనిపెడుతుంటాడు. తన యూట్యూబ్ ఛానెల్ నగ్గెట్‌నొగ్గిన్ ద్వారా... వాటిని ప్రపంచానికి చూపిస్తూ ఉంటాడు. ఐతే... ఓ మొబైల్ (ఐఫోన్) సంవత్సరం కిందట అమెరికా... సౌత్ కరోలినాలోని ఎడిస్టో నదిలో పడిపోయింది. ఆ విషయం బెన్నెట్‌కి తెలీదు. అతను ఎప్పట్లాగే... నదిలో ట్రెజర్ కోసం మెటల్ డిటెక్టర్ ద్వారా వెతుకుతుంటే... ఐఫోన్ తగిలింది. నీటిలో పడిన ఏడాది తర్వాత దొరికిన ఫోన్ పనిచేస్తుందని అనుకోగలమా. బెన్నెట్ కూడా పాతగా కనిపిస్తున్న ఆ ఫోన్ పనిచేయదనే అనుకున్నాడు. కానీ అది ఐఫోన్ కదా. పవర్‌ఫుల్ బ్రాండ్ ఫోన్. ఇప్పటికీ అది చక్కగా పనిచేస్తోంది. షాకైన అతను అదే విషయాన్ని చెబుతూ... ఓ వీడియో తీసి... తన ఛానెల్‌లో పెట్టాడు. ఇటీవలే పెట్టిన ఆ వీడియోకి ఇప్పటికే లక్ష వ్యూస్, వేల లైక్స్ వచ్చాయి.

ఇంతకీ ఆ ఐఫోన్ ఎవరిదో బెన్నెట్‌కి తెలియలేదు. అందులో ఏ సమాచారం ఉందో కూడా తెలియలేదు. ఎందుకంటే... దానికి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంది. దాన్ని అన్‌లాక్ చెయ్యలేకపోయాడు. అందుకే అందులో సిమ్ తీసి... మరో ఫోన్‌లో వేశాడు. తద్వారా... కాంటాక్ట్ నంబర్స్ కనిపించాయి. వాటి ద్వారా... ఆ ఫోన్ ఓనర్‌ని గుర్తించాడు. అది ఎరికా బెన్నెట్ అనే మహిళది. ఆమె 2018 జూన్ 19న ఫ్యామిలీ ట్రిప్‌గా వెళ్తూ... దాన్ని పోగొట్టుకుంది. ఆమె ఎంతో ఆనందపడింది.


జులైలో కూడా మైకేల్ ఇలాగే... Iphone XR కనుక్కున్నాడు. దాన్ని దాని ఓనర్‌కు చేరవేశాడు. మైకేల్ తన ట్రెజర్ హంట్‌లో అమెరికా సివిల్ వార్ రెలిక్స్, యాపిల్ వాచ్, గోల్డ్ రింగ్, డబ్బులు, కత్తులు, నగలు ఇలా చాలా కనుక్కున్నాడు. 12 ఏళ్ల వయసులో అతనికి మెటల్ డిటెక్టర్‌ను గిఫ్టుగా ఇచ్చారు. ఇక అప్పటి నుంచీ ట్రెజర్ హంటర్‌గా మారిపోయాడు.
First published: October 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading