హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US Election 2020: కమలా హారిస్ గెలవాలంటూ తమిళనాడులో పోస్టర్లు...

US Election 2020: కమలా హారిస్ గెలవాలంటూ తమిళనాడులో పోస్టర్లు...

Kamala Harris | డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ పేరును గత వారం ప్రకటించడం తెలిసిందే. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడు నుంచి వలసవెళ్లి అమెరికాలో స్థిరపడగా...ఆమె తండ్రి డొనాల్డ్ హారిస్ స్వస్థలం ఆఫ్రికాలోని జాంబియా. కమలా పోస్టర్లు తమిళనాడులో వెలిసాయి.

ఇంకా చదవండి ...

  డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్(Kamala Harris) పేరును గత వారం ప్రకటించడం తెలిసిందే. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడు నుంచి వలసవెళ్లి అమెరికాలో స్థిరపడగా...ఆమె తండ్రి డొనాల్డ్ హారిస్ స్వస్థలం ఆఫ్రికాలోని జాంబియా. అమెరికాలోని నల్ల జాతీయులతో పాటు ప్రవాస భారతీయ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ వ్యూహాత్మకంగా కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలుపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమలా హారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా పోటీ చేస్తుండటం పట్ల భారత్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్‌కు చెందిన పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు తమ అభినందనలు తెలిపారు.

  తాజాగా తమిళనాడు తంజావూరు జిల్లాలోని ఆమె స్వస్థలంలో కమలా హారిస్ పోస్టర్లు వెలయటం ఆసక్తికరంగా మారింది. కమలా హారిస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పైంగనాడు ప్రాంతానికి చెందిన తులసేందిరపురం గ్రామ ప్రజల పేరిట ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు. పీవీ గోపాలన్ మనుమరాలు అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. కమలా హారిస్ ఎన్నికల బరిలో నిలుస్తుండటంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలు తమిళనాడులోని ఆమె స్వస్థలంలో ఆసక్తిరేపుతున్నాయి.

  కమలా సోదరి కుమార్తె మీనా హారిస్ ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ స్వస్థలమైన తమిళనాడు నుంచి ఈ పోస్టర్‌ ఫోటోను పంపినట్లు తెలిపారు.  తాత పీవీ గోపాలన్‌తో కమలా హారిస్ చిన్ననాటి ఫోటోను కూడా ట్వీట్ చేశారు.

  అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు మాసంలో జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో డొమెక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ తలపడుతున్నారు.  బరాక్ ఒబామా ఆ దేశాధ్యక్షుడిగా పనిచేసినప్పుడు బైడెన్ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.

  First published:

  Tags: Kamala Harris, US Elections 2020

  ఉత్తమ కథలు