చైనా(China), పాకిస్థాన్‌తో(Pakistan) ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రక్షణ సామర్థ్యాలను పెంచుకొనేందుకు భారత్(Bharath) చర్యలు ప్రారంభించింది. 2021 డిసెంబర్‌లో అత్యవసర ఆర్థిక అధికారాల ద్వారా రష్యన్ సిస్టమ్‌లను భారత సైన్యం(Indian Army) సేకరించింది. ఒప్పందంలో భాగంగా అదే నెలలో 216 మిసైల్స్, 24 లాంచర్లు, అదనపు టెస్టింగ్ ఎక్విప్‌మెంట్‌ను అందుకుంది. ఆ నెలలో రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఒప్పందం జరిగింది. పుతిన్(Putin) పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని విస్తరించేందుకు రెండు దేశాల మధ్య 28 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. దీనిలో భాగంగానే చైనా, పాకిస్థాన్‌తో సరిహద్దు ఉద్రిక్తతల మధ్య రష్యా నుంచి Igla-S మాన్‌ప్యాడ్‌లను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయం తీసుకుంది. భారత సైన్యం చాలా కాలంగా కొత్త మ్యాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు నివేదికలు కూడా చెబుతున్నాయి. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORAD) కింద భారీ Igla-S సిస్టమ్స్ సేకరణకు రక్షణ మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది.
Igla-S సిస్టమ్ అంటే ఏంటి..?
Igla-S సిస్టమ్ అనేది Igla మాన్‌ప్యాడ్‌ల అధునాతన రూపాంతరం. తక్కువ ఎత్తులో ఎగిరే విమానం, హెలికాప్టర్‌లలో ఏర్పాటు చేయగల Igla-S సిస్టమ్ గాలిలో శత్రువుల మిసైల్స్, డ్రోన్‌లను గుర్తించగలదు. మల్టి లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో శత్రువుల ముప్పును ఎదుర్కోవడంలో చివరి లైన్‌గా పనిచేసే Igla-S సిస్టమ్. ఈ వ్యవస్థలో 9M342 మిసైల్, 9P522 లాంచింగ్ మెకానిజం, 9V866-2 మొబైల్ టెస్ట్ స్టేషన్, 9F719-2 టెస్ట్ సెట్ ఉంటాయి. కనిపించే అన్ని రకాల ఫిక్స్‌డ్, రోటరీ-వింగ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను, క్రూయిజ్ మిసైల్స్‌ను ఓడించడానికి Igla-S మ్యాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను తయారు చేసినట్లు రోసోబోరోనెక్స్‌పోర్ట్ సంస్థ తెలిపింది. ఇగ్లా-ఎస్ మిసైల్స్ వ్యూహాత్మక విమానాల దాడుల నుంచి సైనిక స్థావరాలు, పౌర ఆస్తులకు 24 గంటలూ రక్షణ కల్పిస్తాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. యుద్ధ హెలికాప్టర్‌లతో పాటు క్రూయిజ్ మిసైల్స్, మానవరహిత వైమానిక వాహనాలు (UAV)ను అడ్డుకోగల సత్తా వీటికి ఉంటుంది. పంజాబ్‌లో రష్యా వైమానిక రక్షణ వ్యవస్థ S-400 ట్రయంఫ్‌ను ప్రవేశపెట్టిన కొన్ని నెలల తర్వాత ఇగ్లా-ఎస్ సిస్టమ్‌ను ఇండియా తీసుకొచ్చింది.
రష్యా ఆయుధాల కొనుగోలుపై భారత్‌కు అమెరికా హెచ్చరికలు..
ఇదిలా ఉండగా..రష్యా ఆయుధాలను కొనుగోలు చేయవద్దని భారత్‌ను అమెరికా రక్షణ కార్యదర్శి హెచ్చరించాడు. రష్యా వెపన్స్ కొనుగోలు చేయడం తమకు మేలు చేయదని ఇండియా అర్థం చేసుకొంటుందని, కలిసి పని చేస్తున్నామని యూఎస్ రక్షణ కార్యదర్శి తెలిపాడు. రష్యా ఆయుధాలపై పెట్టుబడులు తగ్గించి యూఎస్‌తో బంధం కొనసాగేలా భారత్ వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ పేర్కొన్నాడు. రష్యా సైనిక పరికరాలపై ఆధారపడటాన్ని న్యూఢిల్లీ తగ్గించాలని యూఎస్ డిమాండ్‌గా దీనిని తీసుకోవాలని లాయిడ్ ఆస్టిన్ సూచించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన, అత్యంత అధునాతన ఆయుధ వ్యవస్థలు యూఎస్ వద్ద ఉన్నాయని నొక్కిచెప్పాడు.
డైలమాలో ఇండియా..
అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు, రష్యాతో సైనిక సంబంధాలను సమతుల్యం చేసుకోవాల్సిన పరిస్థితిలో భారత్ ఉంది. భారత్ తమను తాము రక్షించుకోవడానికి రష్యా ఆయుధాలపై ఎక్కువ ఆధారపడటంపై వాషింగ్టన్ అసంతృప్తి చెందడంతో ప్రస్తుతం భారత్ డైలమాలో పడింది. భారతదేశం వద్ద ఉన్న ఆయుధాలలో 85 శాతం రష్యా నుంచి వచ్చినట్లు చెబుతున్న నివేదికలు చెబుతుండగా.. ప్రపంచ దేశాలు రష్యాను పక్కనపెడితే మాస్కోతో సన్నిహిత సంబంధాలు అనువైనవి కాదని భారత్ గ్రహిస్తోంది. ఉక్రెయిన్ పై యుద్ధ సమయంలో భారత్ తటస్థ వైఖరిని అవలబించడంతో పాశ్చాత్య మిత్రదేశాలు కలవరపాటుకు గురయ్యాయి.
PM Modi: ఆరోగ్య రంగంలో కీలక సంస్కరణ.. భాజపా ఎన్నికల ప్రచార అస్త్రం ఇదే..!
అంతే కాకుండా.. ఇటీవల ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి సంబంధించిన UNSC తీర్మానానికి న్యూఢిల్లీ దూరంగా ఉంది. వాణిజ్య చెల్లింపులకు రూపాయి- రూబుల్ ఛానెల్ ఉపయోగించేందుకు భారతదేశం, రష్యా చర్చించుకుంటున్నాయి. ఉక్రెయిన్‌పై మాస్కో దాడికి నిరసనగా రష్యా చమురుపై పశ్చిమ దేశాల ఆంక్షలతో ఈ చర్చలు మొదలయ్యాయి. రష్యాతో సైనిక ఒప్పందాలు, విడిభాగాల సరఫరా, సహకారంపై ఆంక్షల ప్రభావం ఎలా ఉంటుందని ఇండియా అంచనా వేస్తోంది. అయితే అమెరికా హెచ్చరికలపై భారత్ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, Indian Military, Russia, USA