US UK ROCKET LAUNCHERS TO CHALLENGE RUSSIAN ARTILLERY RUSSIA ASKED TO WIPE OUT WEST SUPPLIED WEAPONS TO KYIV GH VB
Russia-Ukraine War: యూఎస్, యూకే రాకెట్ లాంచర్‌లతో రష్యాకు సవాలు.. ఉక్రెయిన్ కు యూఎస్ అందిస్తున్న మిలిటరీ ప్యాకేజీ ఏంటి..?
ప్రతీకాత్మక చిత్రం
రష్యా బెదిరింపులు, హెచ్చరికలు కొనసాగుతున్నా ఉక్రెయిన్‌కు మీడియం రేంజ్ మిసైల్ సిస్టమ్ అందించేందుకు యూఎస్, యూకేలు అంగీకరించాయి. నాలుగు M142 హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ లేదా హిమార్స్‌తో కూడిన 700 మిలియన్ డాలర్‌ల విలువైన సైనిక సాయాన్ని ఉక్రెయిన్‌కు యూఎస్ పంపుతోంది.
రష్యా(Russia) బెదిరింపులు, హెచ్చరికలు కొనసాగుతున్నా ఉక్రెయిన్‌కు(Ukraine) మీడియం రేంజ్ మిసైల్ సిస్టమ్(Mid Range Missile System) అందించేందుకు యూఎస్, యూకేలు(United Kingdom) అంగీకరించాయి. నాలుగు M142 హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ లేదా హిమార్స్‌తో కూడిన 700 మిలియన్ డాలర్‌ల(Million Dollars) విలువైన సైనిక సాయాన్ని ఉక్రెయిన్‌కు యూఎస్ పంపుతోంది. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్(Ukraine) తనను తాను రక్షించుకోవడానికి M270 మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్‌లను(MLRS) ఇస్తామని యూకే(UK) తెలిపింది. కీవ్‌కు గతంలో పశ్చిమ దేశాలు పంపిన ఫిరంగిదళాల కంటే ఎక్కువ పరిధి, కచ్చితత్వం అందించే HIMARS, MLRS ఉన్నాయి.
రష్యా వ్యూహాలు మారుతుండటంతో ఉక్రెయిన్‌కు మా సపోర్ట్ (Support) ఉండాలని మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్‌లతో(Multiple Launch Rocket System) ఉక్రెయిన్ రక్షణ పొందుతుందని UK రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్ చెప్పారు. పరిస్థితులు తీవ్రమవ్వకుండా రాకెట్ లాంచ్ సిస్టమ్‌లను రక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలని ఉక్రెయిన్ నుంచి యూఎస్ కమిట్‌మెంట్ తీసుకుంది. US సహాయ ప్యాకేజీలో ఉన్న గైడెడ్ మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ పరిధి 70 కి.మీ ఉంది. హిమార్స్ ఆపరేషన్, నిర్వహణను అర్థం చేసుకోవడానికి మూడు వారాల శిక్షణ ఉక్రెయిన్ దళాలు పొందనున్నాయి.
కీవ్‌కు యూఎస్ అందిస్తున్న మిలిటరీ ప్యాకేజీ ఏంటి..?
కౌంటర్-ఆర్టిలరీ, ఎయిర్ సర్వైలెన్స్ రాడార్‌లు, 1,000 జావెలిన్ యాంటీ ట్యాంక్ ఆయుధాలు, 6,000 యాంటీ ఆర్మర్ వెపన్స్, 155 మిల్లీమీటర్ ఆర్టిలరీ రౌండ్లు 15,000, 15 ట్యాక్టికల్ వెహికల్స్(వివరాలు తెలియవు), డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా బలగాలను ఎదుర్కోవడానికి HIMARS, MLRS సిస్టమ్‌లను ఉక్రెయిన్ ఉపయోగించనున్నది. HIMARSతో పరిస్థితులు మారుతాయని పాశ్చాత్య అధికారులు ఆశించనప్పటికీ.. సిస్టమ్‌లను తొలగించాలని రష్యా ఒత్తిడి చేసింది.
వెస్ట్రన్ రాకెట్ లాంచర్‌లపై రష్యన్ వెటరన్స్ హెచ్చరిక..
టాస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాశ్చాత్య రాకెట్ లాంచర్‌ల గురించి రష్యాను రష్యా ఆర్మీ వెటరన్ అలెక్సీ సకాంతేవ్ హెచ్చరించింది. రష్యాకు వ్యతిరేకంగా కీవ్ ఉపయోగిస్తున్న హిమార్స్ రాకెట్ సిస్టమ్ అత్యంత బలమైనదని సకాన్‌స్టేవ్ చెప్పింది. ఒకే రకమైన ఆయుధాలను బ్రిటీష్ M270, యూఎస్ M142 రాకెట్ సిస్టమ్‌లు వినియేగిస్తుంది. ఈ వ్యవస్థలు GPSతో అడజస్ట్ చేసిన గైడెడ్ ఆయుధాలను కూడా ప్రయోగించగలవని సకాన్‌స్టేవ్ చెప్పాడు. ఫ్రంట్‌లైన్‌కు సమీపంలో, వెనుకవైపు లక్ష్యాలను చేధించడానికి ఉక్రెయిన్‌కు సిస్టమ్‌లు ఉపయోగపడతాయనిన రష్యన్ వెటరన్ తెలిపారు. ఉక్రెయిన్ దళాలకు లక్ష్యంపై కాల్పులు జరపడానికి, కొన్ని నిమిషాల వ్యవధిలో రీలోడ్ చేయడానికి కూడా సహాయపడనున్నట్లు యూఎస్ హిమార్స్ పేర్కొన్నాడు. రష్యన్ దళాల ఎదురు ఫిరంగి కాల్పులను నివారించడానికి ఉక్రెయిన్ సైన్యానికి ఉపయోగపడుతుందని విశ్లేషణల ద్వారా తెలుస్తోంది.
వెస్టర్న్ రాకెట్ లాంచర్‌లను రష్యా తొలగించగలదా..
పాశ్చాత్య రాకెట్ లాంచర్లు, ఫిరంగి వ్యవస్థలను నాశనం చేయగల సామర్థ్యం రష్యాకు ఉందని సకాన్‌స్టేవ్ వెల్లడించాడు. పాశ్చాత్య ఆయుధాలను యుద్ధభూమిలో మోహరించే ముందు నాశనం చేయడానికి రష్యా ప్రయత్నించాలని సూచించారు. ఇలాంటి సిస్టమ్‌లు రష్యా వద్ద సమృద్ధిగా ఉన్నాయని, ఉక్రెయిన్‌లో విస్తృతంగా ఉపయోగించారని సకాన్‌స్టేవ్ చెప్పారు. డాన్‌బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఉక్రెయిన్ ఫిరంగి వ్యవస్థలు అడ్డంకిగా మారతాయని రష్యా భయపడుతోంది. గ్రౌండ్ ఫోర్సెస్‌ను తుపాకులు, పేలుడు పదార్థాలు, రాకెట్ సిస్టమ్‌లతో రష్యా మోహరించింది. అయినప్పటికీ యుద్ధభూమిలో ఫిరంగి వ్యవస్థలను ఉపయోగించడం లాజిస్టిక్స్ పరంగా కష్టం.
ఉక్రెయిన్ హిమార్స్‌ని యుద్దభూమిలో మోహరిస్తే, రష్యాకు మరిన్ని ట్రక్కులు అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది రష్యా సైన్యానికి లాజిస్టికల్ సమస్యలను సృష్టిస్తుందని విశ్లేషకులు తెలుపుతున్నాయి. డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా దాడికి ఉక్రెయిన్ నుంచి భారీ ప్రతిఘటన ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే యుద్ధ గమనాన్ని మార్చేందుకు ఉక్రెయిన్‌కు ట్యాంకులు, క్షిపణుల వంటి సైనిక సామాగ్రి చాలా అవసరమమని విశ్లేషకులు అంటున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.