హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

జైషే మహ్మద్‌ చీఫ్‌ను బ్లాక్ లిస్టులో పెట్టండి... ఐరాసను కోరిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్

జైషే మహ్మద్‌ చీఫ్‌ను బ్లాక్ లిస్టులో పెట్టండి... ఐరాసను కోరిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్

India Vs Pakistan : ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా నాన్చుతున్న పాకిస్థాన్‌పై ప్రపంచ దేశాల నుంచీ ఒత్తిడి కొనసాగుతోంది.

India Vs Pakistan : ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా నాన్చుతున్న పాకిస్థాన్‌పై ప్రపంచ దేశాల నుంచీ ఒత్తిడి కొనసాగుతోంది.

India Vs Pakistan : ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా నాన్చుతున్న పాకిస్థాన్‌పై ప్రపంచ దేశాల నుంచీ ఒత్తిడి కొనసాగుతోంది.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కొత్త ప్రతిపాదన చేశాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరాయి ఆ దేశాలు. జైషే మహ్మద్ ఉగ్రవాది... కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్ర దాడికి పాల్పడిన దృష్ట్యా ఈ ప్రతిపాదన తెచ్చినట్లు ANI వార్తా సంస్థ తెలిపింది. ఈ ప్రతిపాదనను పాకిస్థాన్‌కు అండగా నిలుస్తున్న చైనా వ్యతిరేకించే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఇంతకు ముందు 2016లో ఐసిస్, 2017లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా చైనా వ్యతిరేకించిందన్న అంశాన్ని గుర్తుచేసింది. మసూద్ అజార్‌పై ట్రావెల్ బ్యాన్ విధించి... ఆయన ఆస్తుల్ని జప్తు చెయ్యాలని 15 మంది సభ్యుల భద్రతా మండలిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కోరినట్లు రాయిటర్స్ వివరించింది. ఐరాస హెచ్చార్సీ విభాగంతో మాట్లాడిన భారత్... జైషే మహ్మద్‌పై పాకిస్థాన్ చర్యలు తీసుకునేలా ఒత్తిడి చెయ్యాలని కోరింది.

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ భారత్‌కి వ్యతిరేకంగా పనిచేస్తోంది. దీనికి ఆల్‌ఖైదాతో సంబంధాలున్నాయి. అల్‌ఖైదాను 2001లో ఐరాస భద్రతా మండలి బ్లాక్ లిస్టులో పెట్టింది. 2001 డిసెంబర్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాదులు, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న మరో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉగ్రవాదులతో కలిసి భారత పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డారు.

ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్ర దాడిపై చాలాసార్లు భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపాక, ఐరాస భద్రతామండలి ఉగ్రదాడిని ఖండించింది. అది కూడా దాడి చేసింది తామేనని జైషే మహ్మద్ స్వయంగా ప్రకటించడంతో భద్రతా మండలి ఆ ఖండన చెయ్యగలిగింది. దీనికి కారణం చైనా ఆ ఉగ్రవాద సంస్థను వ్యతిరేకించకుండా, సమర్థిస్తుండటమేనన్న వాదన బలపడుతోంది.

మరోవైపు భారత అంతర్జాతీయ సరిహద్దు వెంట జమ్మూకాశ్మీర్‌లో స్కూళ్లను మూసివేశారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అటు పాకిస్థాన్‌లో విమాన రాకపోకల్ని ఇంకా పునరుద్ధరించలేదని తెలుస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని తాము చెప్పేవరకూ ప్రారంభించవద్దని పాకిస్థాన్ పౌర విమాన శాఖ ఆదేశించినట్లు సమాచారం. లాహోర్‌లో చిక్కుకున్న నలుగురు భారతీయులు ఇవాళ వాఘా సరిహద్దు నుంచీ భారత్ లోకి వచ్చే అవకాశాలున్నాయి. అటు ఎయిర్ కెనడా సంస్థ భారత్‌కు విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు పీటీఐ తెలిపింది.

బెంగళూరులోని కరాచీ బేకరీకి బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలిసింది. బేకరీ పేరులో కరాచీ పేరును తొలగించకపోతే... బేకరీని పేల్చేస్తామని ఎవరో బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు... ఫోన్ చేసిన వ్యక్తిని విక్కీ శెట్టిగా గుర్తించామని చెప్పినట్లు పీటీఐ తెలిపింది.

సైనికుల త్యాగాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు చేసిన విమర్శల్ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తప్పుపట్టారు. దేశమంతా ఒకే మాటపై నిలబడదామని ప్రతిపక్షాలను కోరారు.


ఇవి కూడా చదవండి :


కోటి మందితో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్... ప్రపంచంలోనే అతి పెద్దది


ఇవిగో పుల్వామా ఉగ్ర దాడి ఆధారాలు... పాకిస్థాన్‌కు సమర్పించిన భారత్


మీ మొబైల్ లో యాప్స్‌ డైరెక్టుగా ఎవరికైనా పంపాలా... సింపుల్... ఇలా చెయ్యండి


వాట్సాప్ సీక్రెట్ ట్రిక్... అవతలి వాళ్లకు తెలియకుండా వాళ్ల స్టేటస్ చూడటం ఎలా?

First published:

Tags: Jammu and Kashmir, Pulwama Terror Attack, Surgical Strike 2, United Nations

ఉత్తమ కథలు