డాన్‌బాస్‌లో రష్యా(Russia) బలగాలతో పోరాడేందుకు ఉక్రెయిన్‌కు(Ukraine) ఫీనిక్స్ ఘోస్ట్ టాక్టికల్ డ్రోన్లను(Drones) యూఎస్(US) పంపనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు సరికొత్త ‘ఫీనిక్స్ ఘోస్ట్’ డ్రోన్లను పంపడానికి రెడీ అయినట్లు యూఎస్ వర్గాలు తెలుపుతున్నాయి. డాన్‌బాస్‌లో ఉక్రెయిన్ అవసరాలకు కొత్త లొయిటరింగ్ UAV టైలర్-మేడ్ పరికరాలు ఉపయోగపడనున్నాయి. పుతిన్(Putin) దళాలపై దాడి చేయడానికి 'ఫీనిక్స్ ఘోస్ట్' వ్యూహాత్మక UAVలను రూపొందించారు. తూర్పు ఉక్రెయిన్‌లో ‘ఘోస్ట్’ డ్రోన్ గేమ్ ఛేంజర్‌గా మారుతుందా.. అనేది చూడాలి. ఉక్రెయిన్ కోసం US ప్రకటించిన తాజా $800 మిలియన్ల ఆయుధ ప్యాకేజీలో ప్రత్యేకమైన మిలిటరీ ఎక్విప్మెంట్(Equipment) ఉన్నాయి. యూఎస్ వైమానిక దళం రూపొందించిన ‘ఫీనిక్స్ ఘోస్ట్’ వ్యూహాత్మక డ్రోన్ మునుపెన్నడూ లేని వ్యవస్థ అని నివేదికలు చెబుతున్నాయి. ఉక్రేనియన్ దళాలకు 121 కంటే ఎక్కువ ‘ఫీనిక్స్ ఘోస్ట్’ వ్యూహాత్మక మానవరహిత వైమానిక వ్యవస్థలను యూఎస్ అందిస్తోంది. 'ఫీనిక్స్ ఘోస్ట్' వ్యూహాత్మక డ్రోన్లను US-బేస్డ్ AEVEX ఏరోస్పేస్ తయారు చేసినట్లు పెంటగాన్ వెల్లడించింది.
Shocking : వీడు మనిషి కాదు..భార్య,మరదలిని చంపి..రోజూ వచ్చి మృతదేహాలను..
'ఫీనిక్స్ ఘోస్ట్' వ్యూహాత్మక UAV అంటే ఏంటి..?
'ఫీనిక్స్ ఘోస్ట్' అనేది తక్కువ ధరలో, ఒక్కసారి మాత్రమే ఉపయోగించే సూసైడ్ డ్రోన్. ఇది మందుపాతర వంటిది. లొయిటరింగ్ మందుగుండు అనేది ఒక రకమైన UAV. ఒక లక్ష్యంలోకి దూసుకెళ్లే ముందు గగనతలంలో ఎగురుతుంది. పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ‘ దండయాత్రకు ముందు నుంచి అభివృద్ధిలో ఉన్న డ్రోన్. దీనిపై వైమానిక దళం పని చేస్తోంది. ఉక్రేనియన్ల అవసరాల గురించి చర్చలు జరుపుతున్నప్పుడు ఈ ప్రత్యేక వ్యవస్థ వారి అవసరాలకు, ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్‌లోని అవసరాలకు సరిపోతుందని విశ్వసించాం. ఇది ఇప్పటికే అభివృద్ధిలో ఉంది. అయితే తూర్పు ఉక్రెయిన్‌లో వ్యూహాత్మక స్వభావం కలిగిన మానవరహిత వైమానిక వ్యవస్థల కోసం ఉక్రేనియన్ అవసరాలకు అనుగుణంగా మేము ఆ అభివృద్ధిని కొనసాగిస్తాం అన్నారు.
'ఫీనిక్స్ ఘోస్ట్' గతంలో ఉక్రెయిన్‌కు పంపిణీ చేసిన స్విచ్‌బ్లేడ్ మానవరహిత వ్యవస్థల మాదిరిగానే ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఉక్రెయిన్‌కు 400 స్విచ్‌బ్లేడ్ లాటరింగ్ ఆయుధాలను US విరాళమిచ్చింది. స్విచ్బ్లేడ్లకు 'కామికేజ్ డ్రోన్లు" లేదా 'లోటరింగ్ మందుగుండు సామగ్రి'గా పేరు ఉంది. కచ్చితమైన స్ట్రైక్‌లో క్రాష్ చేయడానికి, పేల్చడానికి ముందు లక్ష్యం మీదుగా ఎగిరే స్విచ్బ్లేడ్లు. ఉక్రెయిన్ డాన్బాస్ ప్రాంతంలో జరిగే పోరాటానికి ‘ఘోస్ట్’ డ్రోన్లు బాగా సరిపోతాయని పెంటగాన్ తెలిపింది. ‘‘ఈ మానవరహిత వైమానిక వ్యవస్థను వ్యూహాత్మక కార్యకలాపాల కోసం రూపొందించాం.
లక్ష్యాలపై దాడి చేయడానికి ప్రత్యేకంగా దీన్ని తయారు చేయలేదు. ఇది దాదాపు అన్ని మానవరహిత వైమానిక వ్యవస్థల మాదిరిగానే ఆప్టిక్స్‌ను కలిగి ఉంటుంది. ఇది సైట్ పిక్చర్స్ కూడా క్యాప్చర్ చేస్తుంది. కానీ దీని ప్రధాన దృష్టి దాడి చేయడం’’ అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ తెలిపాడు. దీని పరిధి, కచ్చితమైన సామర్థ్యాల గురించి మరింత సమాచారం వెల్లడించడానికి పెంటగాన్ నిరాకరించింది. స్విచ్బ్లేడ్లను ఆపరేట్ చేయడానికి శిక్షణ పొందిన ఉక్రేనియన్ దళాలు కొత్త వ్యవస్థను ఆపరేట్‌చేయడం నేర్చుకోవాలని చెప్పిన కిర్బీ తెలిపాడు. ఉక్రెయిన్‌కు US తాజా సైనిక సహాయం.. రష్యా దళాలతో పోరాడేందుకు.. ఏప్రిల్ 21న ఉక్రెయిన్‌కు $800 మిలియన్ల సైనిక సహాయంతో కొత్త ప్యాకేజీని ప్రకటించింది.
ఉక్రెయిన్‌కు తాజా US మిలిటరీ సహాయంలో.. 72 155mm హోవిట్జర్లు, 72 వ్యూహాత్మక వాహనాలు, 72 సాయుధ వాహనాలు, 144,000 ఫిరంగి రౌండ్లు, 120కి పైగా ఫీనిక్స్ ఘోస్ట్ వ్యూహాత్మక డ్రోన్లు, ఫీల్డ్ ఎక్విప్మెంట్, విడి భాగాలు ఉన్నాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో పెరుగుతున్న రష్యా దాడిని నిరోధించేందుకు సహాయపడటానికి కొత్త ప్యాకేజీని రూపొందించినట్లు బైడెన్ తెలిపాడు. ‘యుద్దభూమిలో ఉక్రెయిన్ ప్రతిఘటనను బలోపేతం చేయడంతో పాటు, ఉక్రెయిన్ ప్రజలకు మా మద్దతును ప్రకటిస్తున్నాం. ఉక్రెయిన్ ప్రభుత్వానికి ప్రత్యక్ష ఆర్థిక సహాయంగా అదనంగా $500 మిలియన్లను అందిస్తున్నాం.
దీనితో కలిపి గత రెండు నెలల్లో ఉక్రెయిన్‌కు మేము అందించిన మొత్తం ఆర్థిక సహాయం 1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రష్యన్ దాడితో నాశనమైన కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడానికి, ఉక్రెయిన్ ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తున్న కార్మికులకు ఆర్థికంగా సహాయం చేసేందుకు ఈ డబ్బు ఉపయోగపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరాకు అంతరాయం కలగకుండా మరిన్ని నిధులను సమీకరిస్తున్నట్లు బైడెన్ తెలిపాడు. ఇప్పటికే డ్రోన్లతో పాటు స్టింగర్, జావెలిన్ క్షిపణులతో సహా పాశ్చాత్య ఆయుధాలను ఉక్రేనియన్ దళాలు ఉపయోగిస్తున్నాయి. ఫిబ్రవరి 24న రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి.. ఉక్రెయిన్‌కు సుమారు $3.4 బిలియన్ల భద్రతా సహాయాన్ని అమెరికా అందించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War, Ukraine