US నుంచి ఉక్రెయిన్‌కు(Ukraine) తదుపరి ప్రధాన సైనిక సహాయ ప్యాకేజీలో HIMARS లేదా MLRS రాకెట్ సిస్టమ్స్ అందే అవకాశం కనిపిస్తోంది. వచ్చే వారంలో దీనిపై బహిరంగ ప్రకటన రావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని తూర్పు డోన్బాస్ ప్రాంతంలో పుతిన్(Putin) దళాల దాడులు కొనసాగుతుండగా ఈ నివేదికలు బయటకు వచ్చాయి. HIMARSకి సంబంధించి ఉక్రెయిన్ అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ అన్నాడు. ఉక్రెయిన్ అవసరాలను తీర్చేందుకు ఇంటర్నేషనల్ కమ్యునిటీ నుంచి సాధ్యమైనంత వరకు సపోర్ట్ తీసుకొంటామని లాయిడ్ ఆస్టిన్ ప్రకటించాడు.
ఉక్రెయిన్ డిమాండ్లను తీర్చడంపై ప్రస్తుతం పూర్తి వివరాలు చర్చించే ఉద్దేశం లేదని యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ పేర్కొన్నాడు. ప్రెసిడెంట్ జెలెన్స్కీతో సహా ఉక్రెయిన్ అధికారులు రష్యాతో పోరాడటానికి రాకెట్ సిస్టమ్‌లను పదే పదే కోరినట్లు నివేదికలు వెల్లడించాయి. ఉక్రెయిన్ వరుస అభ్యర్థనల తర్వాత యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ స్పందించారు.
మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్(MLRS)..
ట్రాక్డ్ ఛేసిస్పై రాకెట్ వ్యవస్థ ఏర్పాటు. 227mm ఆర్టిలరీ రాకెట్లు లేదా ATACMS పేల్చగల సామర్థ్యం. వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా రాకెట్లను పేల్చగల యూఎస్ తయారు చేసిన మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్. ఉక్రెయిన్ వద్ద ఉన్న అన్ని రకాల సిస్టమ్లకంటే MLRS ఎన్నో రెట్లు మెరుగైందని నివేదికలు చెబుతన్నాయి. హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్(HIMARS)ని కూడా ఉక్రెయిన్ కోరుతోంది. తేలికైన HIMARSకు ఏకకాలంలో ఒకే రకమైన మందుగుండు సామగ్రిని పెద్ద సంఖ్యలో ప్రయోగించగల సత్తా ఉంది.
మందుగుండు సామగ్రి రకాన్ని బట్టి 300 కిలోమీటర్ల వరకు ప్రయోగించగల హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ కలదు. ఉక్రెయిన్‌కు MLRS, HIMARS యూఎస్ అందిస్తే.. యుద్ధంలో అవే కీలకంగా మారే అవకాశం ఉంది. అధునాతన ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించడంపై గత వారం వైట్‌హౌస్‌లో చర్చలు జరిగినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. MLRS, HIMARSతో రష్యాపై ఉక్రెయిన్ పెద్ద ఎత్తున దాడులకు దిగే అవకాశం ఉందని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పేర్కొంది. యూఎస్ అధునాత ఆయుధాలను అందిస్తూ రెచ్చగొట్టే చర్యలుగా రష్యా భావించే అవకాశం ఉందని చర్చ చడుస్తోంది. రష్యా పౌరులపై ఉక్రెయిన్ దాడులకు దిగుతుందేమోనని యూఎస్ సందేహిస్తోంది. పౌరులపై దాడులకు సంబంధించి యూఎస్ ప్రశ్నలకు ఉక్రెయిన్ అధికారులు స్పష్టత ఇవ్వలేదని సమాచారం. పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాతో పశ్చిమ దేశాలు రష్యాకు పరోక్ష లక్ష్యంగా మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rockets, Russia-Ukraine War, USA